Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

త్రివిక్రమ్‌, ఎస్‌.జె.సూర్య చేతిలో పెట్టాడా.?

త్రివిక్రమ్‌, ఎస్‌.జె.సూర్య చేతిలో పెట్టాడా.?

పవన్‌కళ్యాణ్‌ కోసం త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ త్యాగం చేశాడేమో.! 'కోబలి' సినిమా కథని త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌, ఎస్‌.జె.సూర్య చేతిలో పెట్టేశాడేమో.! ఈ సినిమాకి తెరవెనుక త్రివిక్రమ్‌ సహాయ సహకారాలు అందిస్తున్నాడేమో.! 

ఏమో.. ఏమో.. ఏమో.. పవన్‌కళ్యాణ్‌ తాజా చిత్రం గురించి ఇలా కుప్పలు తెప్పలుగా అనుమానాలు, గాసిప్స్‌ తెరపైకొస్తున్నాయి. ఎస్‌.జె.సూర్య దర్శకత్వంలో పవన్‌ కళ్యాణ్‌ నటించనున్న సినిమా ఇప్పటికే లాంఛనంగా ప్రారంభమైంది. సినిమా సెట్స్‌పైకి రావాల్సి వుంది. శరవేగంగా సినిమాని పూర్తి చేసెయ్యాలన్నది పవన్‌కళ్యాణ్‌ ఆలోచన అట. అది సాధ్యమేనా.? అన్న విషయం పక్కన పెడితే, వీలైనంత త్వరగా సినిమా చేసెయ్యడానికి ఎస్‌.జె.సూర్య ప్రిపేర్డ్‌గానే వున్నాడన్నది ఇన్‌సైడ్‌ సోర్సెస్‌ కథనం. 

ఇక, ఈ సినిమాకి సంబంధించి తాజా ఖబర్‌ ఏంటంటే, వాస్తవానికి ఇది కూడా పవన్‌కళ్యాణ్‌ కథేనట. 'బంగారం' టైమ్‌లో పవన్‌కళ్యాణ్‌ అనుకున్న లైన్‌ని, త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ 'కోబలి' పేరుతో డెవలప్‌ చేశాడట. అది అలా అలా తిరిగి తిరిగి ఇప్పుడు ఇలా ఎస్‌.జె.సూర్య చేతిలో పడిందట. ఇదెంత నిజం.? అన్నదానిపై స్పష్టత రావాల్సి వుంది. 'కడప కింగ్‌' అనీ, ఇంకోటనీ.. ఈ సినిమా గురించి గాసిప్స్‌ విన్పిస్తోంటే, ఆ 'కోబలి'నే ఇలా మారిందన్న ఊహాగానాలకు బలం చేకూరుతోంది. 

ఇంతకీ, ఈ సినిమా విషయమై పవన్‌కళ్యాణ్‌ ఏమంటాడో.? ఒకవేళ పవన్‌కళ్యాణ్‌ కథే అయితే, 'సర్దార్‌ గబ్బర్‌సింగ్‌'లా తేడా కొట్టేయదు కదా.?

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?