Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

త్రివిక్రమ్ త్యాగాలే త్యాగాలు?

త్రివిక్రమ్ త్యాగాలే త్యాగాలు?

సూపర్ స్టార్ మహేష్ బాబుకి డైరక్టర్ త్రివిక్రమ్ కు మంచి సంబంధాలు వున్నాయి. అందుకే ఇప్పుడు తమ స్నేహం కోసం త్రివిక్రమ్ తన సినిమా విడుదలను అబేయన్స్ లో వుంచేసారు. అ..ఆ సినిమా విడుదలకు రెడీ అయింది. ఫస్ట్ వీక్ డేట్ ఎప్పటి నుంచో అనుకున్నారు..కానీ తన తరువాత సినిమా హీరో సూర్య కోసం త్యాగం చేసేసారు. 13 అని అనుకున్నారు. మరో హీరో మహేష్ బాబు కోసం త్యాగం చేసే పరిస్థితి కనిపిస్తోంది. 

మహేష్ బాబు అఫిషియల్ గా ప్రకటించకపోయినా, తన బ్రహ్మోత్సవం సినిమాను 20న విడుదల చేయాలని ఫిక్స్ అయ్యారు. అయితే ఆ సినిమా షెడ్యూళ్లు 7 వరకు వున్నాయి.. మరో రెండు రోజులు కూడా అవసరం పడతాయని వినికిడి. అంటే 9 వస్తుంది. అక్కడి నుంచి కేవలం రెండు నుంచి నాలుగు రోజుల్లో సెన్సారుకు తీసుకెళ్లాలి. అంటే ఇది సాధ్యమా అన్నది అనుమానం. అందువల్ల బ్రహ్మోత్సవం 27 కు వెళ్లే అవకాశం వుందని కూడా టాక్ వినిపిస్తోంది. 

బ్రహ్మోత్సవం 27న ఫిక్స్ అయితే 13న అ..ఆ వేసేద్దామని నిర్మాత చినబాబు..డైరక్టర్ తివిక్రమ్ ల ప్లాన్. కానీ బ్రహ్మోత్సవం విషయం తెలియడం లేదు. మరో మూడు రోజుల్లో జరిగే అడియో ఫంక్షన్ లో డేట్ ప్రకటిస్తే, 13న రావాలని వారు అనుకుంటున్నారు. కానీ 20నే విడుదల ప్రకటిస్తే, అ..ఆ జూన్ లోకి వెళ్లిపోతుంది. ఆ విధంగా మరోసారి త్రివిక్రమ్ తన సినిమా విడుదల డేట్ ను త్యాగం చేసినట్లే. 

ఇదిలా వుంటే ఒకే జోనర్ కు చెందిన రెండు సినిమాలు ఒక వారం గ్యాప్ లో వస్తే మొదటి సినిమాకు చాన్స్ ఎక్కువ వుంటుందని ఓ అంచనా. ఆ విధంగా 13న అ..ఆ వస్తే బ్రహ్మోత్సవం సినిమాకు కష్టం. అందుకే 20 అని స్ట్రాటజిక్ గా డేట్ చెప్పి, అవకాశం వుంటే రావడం..లేదంటే వారం వెనక్కు వెళ్లడం చేయాలని బ్రహ్మోత్సవం టీమ్ గేమ్ ప్లాన్ చేసిందని ఇండస్ట్రీ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. సబ్జెక్ఠ..టేకింగ్ ఇతరత్రా వ్యవహారాల రీత్యా అ..ఆ కు ఎడ్జ్ వుంటుందని, అందువల్ల అవసరం అయితే ధైర్యంగా వెనక్కు వెళ్లాలని అ..ఆ నిర్మాతలు, దర్శకులు అంటున్నారు. 

తప్పదు..రేపు మళ్లీ త్రివిక్రమ్ కో, చినబాబుకో మహేష్ తో డేట్లు అవసరం పడితే...? ఆ మాత్రం త్యాగాలు చేయాలి మరి. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?