సునీల్ ఆశలు పెట్టుకున్న ఆఖరు సినిమా ట్రూ కంట్రీస్. ఈ సినిమా విజయం సాధిస్తేనే సునీల్ హీరో కెరీర్ ముందుకు సాగుతుంది. మళయాలంలో హిట్ అయిన ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేసారు. కన్నడలో కూడా రీమేక్ అవుతోంది. తెలుగులో సినిమా మొత్తం పూర్తయింది. బిజినెస్ కోసం కిందా మీదా అవుతున్నారు. అదంతా అలా వుంచితే ఈ సినిమా విడుదలకు డేట్ ఏదీ అన్నది పెద్ద సమస్య.
నవంబర్ 24, డిసెంబర్ 1 డేట్లు అయిపోయాయి. డిసెంబర్ 22, డిసెంబర్ 29 ఫుల్. ఇక మిగిలింది డిసెంబర్ 8, 15 మాత్రమే. ఈ రెండు డేట్లలోనే వేసుకోవాలి. లేదూ అంటే ఇక మళ్లీ మరో మూడు నాలుగు నెలల వరకు సరైన డేట్ దొరకడం కష్టం.
కానీ డిసెంబర్ ఫస్ట్ వీక్ నుంచి సెకెండ్ వీక్ లోగా వేయాలి అంటే సినిమా బిజినెస్ కూడా పూర్తి కావాలి. అది కాకుండా విడుదల అంటే కష్టమే. సినిమా బాగా వచ్చిందని, ఈ సినిమాతో మళ్లీ జోష్ వస్తుందని హీరో సునీల్ నమ్మకంగా వున్నారు.
అలాగే చాలా కాలం తరువాత కమర్షియల్ మూవీ చేస్తున్నందున, దీని తరువాత బయట బ్యానర్లకు వెళ్లే అవకాశం వుంటుందని సినిమా దర్శకుడు కమ్ నిర్మాత శంకర్ ఆశగా వున్నారు. ఇవన్నీ నెరవేరాలంటే ముందు సినిమా జనం ముందుకు రావాలి.