Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

త్వరలో త్రివిక్రమ్ సమర్పించు?

త్వరలో త్రివిక్రమ్ సమర్పించు?

హారిక హాసిని సంస్థతో డైరక్టర్ త్రివిక్రమ్ కు వున్న అనుబంధం సంగతి ఇండస్ట్రీకి తెలిసిందే. ఇప్పుడు ఈ అనుబంధం మరింత ముందుకు వెళ్లబోతోందని తెలుస్తోంది. హఆరిక హాసిని అనుబంధ సంస్థ సితార ఎంటర్ టైన్ మెంట్స్. ఇటు హారిక హాసినికి, అటు సితార ఎంటర్ టైన్ మెంట్స్ కు త్రివిక్రమ్ నే అన్ని విధాలా మెంటార్. ప్రాజెక్టులు ఓకె చేయాలన్నా, పట్టాలకు ఎక్కాలన్నా, స్టార్ కాస్ట్, టెక్నికల్ కాస్ట్ సెలెక్షన్ అంతా ఆయన కనుసన్నలలోనే జరుగుతుంది. అంతే కాదు, కథలు, స్క్రిప్ట్ లు కూడా ఆయన ఓకె చేయాల్సిందే. 

ఇప్పుడు మరో అడుగు ముందుకు వేసి, సితార ఎంటర్ టైన్ మెంట్స్ కు త్రివిక్రమ్ శ్రీనివాస్ సమర్పించు అని వేసే ఆలోచనలో వున్నారని తెలుస్తోంది. ఈ కొత్త ఆలోచన నందినీ రెడ్డి డైరక్షన్ లో చేయబోయే సినిమా నుంచి ప్రారంభమవుతుందని తెలుస్తోంది. నందిని రెడ్డి స్క్రిప్ట్ ను త్రివిక్రమ్ ఓకె చేసారు. హీరో సెలక్షన్ ముందు వెనుక అవుతోంది. విజయ్ దేవరకొండే వుండే అవకాశం చాలా వరకు వుంది. ఈ సినిమాకు టెక్నికల్ వ్యవహారాలు అన్నీ ఇప్పటికే త్రివిక్రమ్ సెట్ చేసేసారు. స్టార్ కాస్ట్ మాత్రం ప్రాసెస్ లో వుంది. 

త్రివిక్రమ్ తో చేసే సినిమాలకు హారిక హాసిని బ్యానర్ వాడి, మిగిలిన వాటికి సితార ఎంటర్ టైన్మెంట్స్ వాడాలని నిర్మాతలు చినబాబు, నాగవంశీ డిసైడ్ అయ్యారు. అయితే సితార ఎంటర్ టైన్ మెంట్స కు ఇప్పుడు త్రివిక్రమ్ సమర్పించు అంటూ ఆయన పేరు కూడా అదనంగా వేస్తారని వినికిడి.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?