సమంత లేటెస్ట్ సెన్సేషన్ ‘యుటర్న్’. కన్నడంలో పెద్ద హిట్ అయిన ఈ థ్రిల్లర్ మూవీని తెలుగులోకి తెచ్చారు. ఈరోజు ఈ సినిమా బిజినెస్ ను క్లోజ్ చేసారు. నైజాం, ఆంధ్ర కలిపి వైజాగ్ డిస్ట్రిబ్యూటర్ సురేష్ రెడ్డి తీసుకున్నారు. ఆరుకోట్ల మొత్తానికి ఆయన ఈ రెండు ఏరియాల హక్కులను తీసుకున్నారు. ఇప్పటికే కోటికి పైగా మొత్తానికి సీడెడ్ హక్కులు ఇచ్చేసారు. దీంతో ఆంధ్ర, తెలంగాణ ఏరియాల హక్కులు ఇచ్చేసినట్లు అయింది.
ఈ సినిమాకు పది కోట్లకు పైగా ఖర్చు చేసారు. థియేటర్ హక్కులతో దాదాపు ఆ ఖర్చు కవర్ అయ్యేటట్లు చూసుకున్నారు నిర్మాతలు. ఈ సినిమాను ఈనెల 13న విడుదలకు అన్ని సన్నాహాలు చేస్తున్నారు. ఇదిలా వుంటే కన్నడ మాతృక కన్నా మరింత బెటర్ గా ఈ సినిమాను తెలుగులో రూపొందించేందుకు ప్రయత్నించినట్లు తెలుస్తోంది.
కన్నడంలో ఎక్కడక్కడ ఇంకా బెటర్ గా వుంటే మరింత బాగుంటుంది అని అనిపిస్తుందో అక్కడక్కడంతా తెలుగులో మరింత బెటర్మెంట్ చేసినట్లు బోగట్టా. ఇదిలా వుంటే శైలజారెడ్డి అల్లుడు కారణంగా ఈ సినిమా వాయిదా పడుతుందన్నది వాస్తవం కాదని, యుటర్న్ కు సంబంధించి అన్ని వర్క్ లు పూర్తి చేసేసారని, ఓవర్ సీస్ ప్రీమియర్లు కూడా ఫిక్స్ అయిపోయాయని యూనిట్ వర్గాలు వెల్లడించాయి.