ఈ సమ్మర్ సీజన్ కు బ్యాడ్ డేట్ ఏదీ అంటే జూన్ తొమ్మిది అంటున్నారు సినిమా ట్రేడ్ జనాలు. ఎందుకంటే అప్పుడే సరిగ్గా స్కూళ్లు ఓపెన్ అవుతున్నాయి. సమ్మర్ లో రకరకాల వ్యవహారాలకు డబ్బులన్నీ ఖర్చుచేసి, స్కూళ్ల టైమ్ కు ఫీజులు, పుస్తకాలు, యూనిఫారమ్ లు అంటూ జనాలు కుస్తీ పడుతుంటారు. అందుకే స్కూళ్లు తీసే టైమ్ లో సినిమాలు విడుదల చేయడానికి నిర్మాతలు జంకుతారు.
ఈ సమ్మర్ సీజన్ లో అలాంటి డేట్ జూన్ 9. కానీ ఇటు చూస్తే, కొన్ని సినిమాలు ఇంకా మిగిలిపోయాయి. పోటీ ఎక్కువై, ఇంకా వర్క్ వుండిపోయి, ఇలా చాలా రీజన్ల వల్ల సినిమాలు కోన్ని వుండిపోయాయి. అవన్నీ ఇక ఈ తొమ్మిదో తేదీనే నమ్ముకోక తప్పడం లేదు. అలాంటి సినిమాల్లో గోపీచంద్ ఆరడుగులు బుల్లెట్ ఒకటి. పాపం, అన్ లక్కీ అంటే ఈ సినిమాదే. మాంచి సబ్జెక్ట్ తో, తమిళ డైరక్టర్ తో ప్రారంభమైంది. కానీ మధ్యలోనే ఆగిపోయింది. అలనాటి హిట్ డైరక్టర్ బి గోపాల్ చేతిలోకి వచ్చింది. అయినా ఫినిష్ కాలేదు. ఫైనాన్స్ సమస్యలు.
పివిపి లాంటి బఢా ప్రొడ్యూసర్ బ్యాకింగ్ దొరికింది. ఫినిష్ అయింది. కానీ డేట్ దొరకలేదు. మే 19 నుంచి డేట్లు మారుతూ వస్తున్నాయి. ఆఖరికి జూన్ 9కి ఫిక్స్ అవుతోందని బోగట్టా. చూడాలి ఎలా వుంటుందో ఫలితం.