మొత్తానికి హీరో సునీల్ పోయి పోయి ఉంగరాల్లో చిక్కుకున్నాడు. ఆ సినిమా ఇప్పట్లో విడుదలయ్యే పరిస్థితి కనిపించడం లేదు. 2న విడుదల చేస్తామని యూనిట్ రెడీ అయింది. ప్రెస్ మీట్ కూడా పెట్టబోయి క్యాన్సిల్ కొట్టింది. అయినా ఒకటీ అరా ఏరియాలు కొన్నవారికి అదే సమాచారం ఇచ్చింది. కానీ ఆ తరువాత సైలెంట్ అయింది. కొత్తగా 8న అంటోంది. కానీ విషయం ఏమిటంటే, 2 కాదు, 8 కాదు అసలు ఎప్పటికయినా వస్తుందా? అన్నది అనుమానం అని ఫీలర్లు వినిపిస్తున్నాయి.
ఎదో కిందా మీదా పడి, తప్పని సరి పరిస్థితుల్లో హీరో సునీల్ డబ్బింగ్ చెప్పేసాడు. డబ్బులు ఇస్తే ఇచ్చారు లేకుంటే లేదు అని డిసైడ్ అయిపోయాడు. కానీ ప్రకాష్ రాజ్ మాత్రం ఇప్పటి దాకా డబ్బింగ్ చెప్పలేదు. డబ్బులు ఇస్తేనే డబ్బింగ్ అన్న లైన్ మీదే ఆయన నిల్చున్నట్లు తెలుస్తోంది. దీంతో సినిమా అలా పడి వుంది.
పాపం ఈ సినిమా విడుదలయితే, బాగుందని టాక్ వస్తే, తనకు బాగుంటుందని సునీల్, తన సినిమాకు బాగుంటుందని తరువాత సినిమా టూ కంట్రీస్ తీస్తున్న ఎన్ శంకర్ అనుకున్నారు. కానీ అంత సీన్ కనిపంచడం లేదు. ఈ సినిమా కన్నా టూ కంట్రీస్ నే ముందుగా బయటకు వచ్చేలా కనిపిస్తోంది. ఎందుకుంటే ఆ సినిమా దాదాపు పూర్తయిపోయింది. మార్కెట్ కూడా స్టార్ట్ చేసారు. పాపం, క్రాంతి మాధవ్, సునీల్ ఇద్దరి కెరియర్ ఉంగరాల్లో చిక్కుకుపోయినట్లు కనిపిస్తోంది.