కాస్టింగ్ కౌచ్ పై ఆమధ్య దేశవ్యాప్తంగా పెద్ద ఉద్యమమే జరిగింది. అది ఉద్యమం అని కొందరు భావించారు, మరికొందరు భ్రమపడ్డారు. అంతకుమించి అక్కడేం జరగలేదు. కాస్టింగ్ కౌచ్ అప్పుడెలా ఉందో, ఇప్పుడు కూడా అలానే ఉంది. దీనికి సజీవ సాక్ష్యంగా నిలుస్తోంది తాజాగా జరిగిన ఓ ఘటన.
ఆమె ఓ వర్థమాన నటి. స్టార్ హీరోయిన్ అవుదామనే ఆశతో టాలీవుడ్ లో అడుగుపెట్టింది. ఆమె దగ్గర ఆ మెటీరియల్ కూడా ఉంది. అలా అని ఆమె ఆషామాషీగా ఇండస్ట్రీలో అడుగుపెట్టలేదు. అందాల పోటీల్లో పాల్గొంది, అందర్నీ ఆకర్షించింది. ఆ తర్వాత నటనలో శిక్షణ తీసుకుంది. అలా ఫుల్ గా ప్రిపేర్ అయి వచ్చిన ఆ హీరోయిన్ కు ఇండస్ట్రీలో ఆహ్వానం పలికే జనాల కంటే, బెడ్ రూమ్ డోర్ తెరిచి పిలిచే జనాలే ఎక్కువగా కనిపిస్తున్నారు.
ఓ చిన్న సినిమాతో ఆమె టాలీవుడ్ లో అడుగుపెట్టింది. అది డిజాస్టర్ అయినా ఆమె లుక్స్ కు మంచి పేరొచ్చింది. ఆ సినిమా ప్రమోషన్ లో భాగంగా టూర్లు నిర్వహిస్తే, పక్కనున్న హీరో కంటే ఈమెపైనే మీడియా ఎక్కువగా ఫోకస్ పెట్టింది. ఆ పాపులారిటీతో రెండో సినిమా ఆఫర్ వెంటనే వచ్చింది. ఈసారి కాస్త క్రేజ్ ఉన్న హీరో. ఇంకాస్త పెద్ద సినిమా. కానీ సమస్య అక్కడే మొదలైంది.
ప్రస్తుతం చేస్తున్న సినిమాతో పాటు, ఆఫర్లతో సంప్రదిస్తున్న చాలామంది కమిట్ మెంట్స్ అడుగుతున్నట్టు సదరు హీరోయిన్ తన ఫ్రెండ్ సర్కిల్ లో చెప్పుకొని బాధపడుతోంది. ఇండస్ట్రీలో అవకాశాలు రావాలంటే కాస్త ''కోపరేట్'' చేయాల్సిందనే విషయం ఈమెకు తెలుసు. అవన్నీ తెలుసుకొనే అడుగుపెట్టింది.
కాకపోతే ప్రస్తుతం జరుగుతున్న వ్యవహారం అంతకుమించి అన్నట్టు సాగుతోందనేది ఈమె ఆవేదన. బయటపడితే కెరీర్ క్లోజ్. అలా అని బాధను మనసులోనే దాచుకోలేని పరిస్థితి.