Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

వక్కంతం మళ్లీ మెగాక్యాంప్ లోనే?

వక్కంతం మళ్లీ మెగాక్యాంప్ లోనే?

వక్కంతం వంశీ కథకుడిగా ప్రూవ్ చేసుకుని, ఇప్పుడు దర్శకుడు అయ్యాడు. దర్శకుడు కావడం అన్నది అతడి చిరకాల కోరిక. ఆ కోరికను తీర్చింది మెగాహీరో అల్లు అర్జున్ నే. నా పేరు సూర్యతో ఆ కోరిక తీరింది. సినిమా విడుదలకు రెడీ అవుతోంది. మరి తరువాత సినిమా సంగతేంటి?

వక్కంతం వంశీ తరువాత సినిమా కూడా మెగా క్యాంప్ లోనే వుంటుందని తెలుస్తోంది. ఆ మేరకు మెగా హీరోల కోసం వక్కంతం రెండు మూడు కథలు రెడీ చేసి పెట్టుకున్నట్లు తెలుస్తోంది. అయితే వక్కంతంకు అవకాశం ఇచ్చే ఆ మెగా హీరో ఎవరు? తరువాత సినిమా ఎప్పుడు అన్నది మరి కొద్ది రోజులు ఆగితే క్లారిటీ వస్తుందంటున్నారు.

ప్రస్తుతం మెగా హీరోలు అందరూ ఎవరి సినిమాల్లో వారు బిజీగా వున్నారు. మరి ఎవరు వక్కంతం కథ విన్నారో? ఎవరు చాన్స్ ఇస్తున్నారో తెలియాలంటే మరి కొద్దిరోజులు ఆగాలంటున్నాయి వక్కంతం సన్నిహిత వర్గాలు. ఇదిలా వుంటే వక్కంతం వంశీకి ఎన్టీఆర్ తో కూడా మాంచి అనుబంధం వుంది. కానీ ఎన్టీఆర్ మరో ఏణ్ణర్థం వరకు ఖాళీలేరు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?