ఏదో ఒక చిన్న పంచ్ వేయకుంటే దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు అస్సలు తోచదు. చేసే ట్వీట్ లేవో నేరుగా చేయడు. ఎవర్నో పొగుడుతూ, మరెవర్నో తిడతాడు. ఎప్పుడూ ఇదే టైపు. ఇప్పుడు లెటెస్ట్ ట్వీట్ దర్శకుడు క్రిష్ సినిమా కంచె మీద.
కంచె సినిమా ట్రయిలర్ బాగుందని మెచ్చుకోవడం వరకు సరే. కుర్రాళ్లకు సీనియర్ దర్శకులు ఆ మాత్రం అభినందనలు అందిచాలి. కానీ రామ్ మరో అడుగు ముందుకు వేసి, కంచె ట్రయిలర్ లో కావచ్చు, పూరి తీస్తున్న లోఫర్ లో కొన్ని సీన్లు కావచ్చు, చూస్తుంటే, మెగాక్యాంప్ హీరోలందరి కన్నా వరుణ్ తేజ 'ది బెస్ట్' అనిపిస్తున్నాడని అన్నాడు.
పవన్ ఎన్నో సినిమాలు చేసాడు. మంచి పెరఫార్మర్ అనిపించుకున్నాడు..చరణ్ కూడా తన ప్రయత్నాలు తాను చేస్తున్నాడు. బన్నీ మిస్టర్ పెర్ ఫెక్ట్ ప్రూవ్ చేసుకున్నాడు. ఇంకా మిగిలన వాళ్లు వున్నారు. ఇలా ఎవరి ప్రయత్నాలు వారు చేస్తుంటే, కేవలం వరుణ్ తేజ ను గాల్లోకి ఎత్తాలని చూడడం వెనుక రామ్ స్ట్రాటజీ ఏమయి వుంటుంది? తన శిష్యుడు పూరి తో సినిమా చేస్తున్నాడు కాబట్టి, మిగిలిన వారు పూరిని దూరం పెట్టారు కాబట్టి, అనుకోవాలా?