రామ్‌గోపాల్ వర్మ, తేజ.. ఇద్దరూ ఇద్దరే. ఈ ఇద్దరూ ఇప్పుడు 'ఎన్టీఆర్' బయోపిక్ తెరకెక్కిస్తున్నారు. విడివిడిగానే లెండి. వర్మ, స్వర్గీయ ఎన్టీఆర్ జీవితంలోని 'లక్ష్మీస్ ఎన్టీఆర్' అనే పర్వాన్ని తెరకెక్కిస్తోంటే, మొత్తంగా స్వర్గీయ ఎన్టీఆర్ బయోపిక్‌ని తెరకెక్కించనున్నాడు దర్శకుడు తేజ. వర్మ ఫిబ్రవరిలో 'లక్ష్మీస్' ఎన్టీఆర్ సినిమాని తెరకెక్కించనుండగా, తేజ ఎన్టీఆర్ బయోపిక్‌ని జనవరిలో పట్టాలెక్కిస్తాడు. తేజ సినిమాలో బాలకృష్ణ నటిస్తుండడం, ఈ చిత్రాన్ని నిర్మిస్తుండడం తెల్సిన విషయాలే. వర్మ సినిమాకి మాత్రం వైఎస్సార్సీపీ నేత రాకేష్‌రెడ్డి నిర్మాత.
ఒకటి టీడీపీ నిర్మిస్తోన్న సినిమా (బాలయ్య టీడీపీ ఎమ్మెల్యేనే కదా), ఇంకొకటి వైఎస్సార్సీపీ నిర్మిస్తోన్న సినిమా.. వెరసి రెండు ఎన్టీఆర్ సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయన్నమాట. ఈలోగా.. అంటే, జనవరి – ఫిబ్రవరి వచ్చేలోగా ఇటు వర్మ, అటు తేజ వేర్వేరు సినిమాలకు కమిట్ అవుతున్నారు. అందులో వర్మ – నాగార్జున హీరోగా సినిమా తెరకెక్కించనుండగా, తేజ – వెంకటేష్‌తో ఓ సినిమా తెరకెక్కించనుండడం గమనార్హం.
మొత్తమ్మీద, గురు శిష్యులిద్దరూ ఇప్పుడు కెరీర్‌లో 'ప్యారలల్'గా అడుగులేస్తున్నారన్నమాట.