ఈమధ్య కాలంలో నాగార్జున తన సినిమాల విషయంలో ఎక్కువగా ఇన్‌వాల్వ్ అవడం, ఒక్కోసారి దర్శకుడి పనిలోను ఇంటర్‌ఫియర్ అవడం గురించి వార్తలు వస్తూనే వున్నాయి. నాగార్జున కూడా ఈ విషయాన్ని అన్యాపదంగా అంగీకరించిన సందర్భాలున్నాయి. 'సోగ్గాడే చిన్నినాయనా', 'రారండోయ్ వేడుక చూద్దాం' చిత్రాలకి నాగార్జున ఎంతగా కల్పించుకున్నారనేది తెలిసిన సంగతే.
రీసెంట్‌గా 'రాజుగారి గది2' ఫైనల్ ఎడిట్ కూడా నాగార్జునే డిసైడ్ చేసారట. సినిమాలో కొన్ని కీలకమైన కామెడీ సన్నివేశాలని ఆయన తొలగించారట. దీంతో షకలక శంకర్ చాలా బాధ పడిపోయాడు కూడా. ఈ విషయంపై టీమ్‌లో మిగిలిన వారంతా చాలా హర్ట్ అవడంతో నాగార్జున సోలోగా ఈ చిత్రాన్ని ప్రమోట్ చేయడమే కాకుండా, ఓపెనింగ్స్ బాగా వచ్చినపుడు ఆ ఘనత తనదే అన్నట్టు మాట్లాడారు.
ప్రస్తుతం నిర్మిస్తున్న 'హలో' చిత్రానికి కూడా నాగార్జునే టైటిల్ ఫిక్స్ చేసారు. ఈ నేపథ్యంలో రామ్ గోపాల్‌వర్మతో చేసే చిత్రానికి నాగార్జున ఫ్రీ హ్యాండ్ ఇస్తారా లేదా అనేది డౌట్‌ఫుల్‌గా మారింది. వర్మ పూర్వ వైభవం కంటే ప్రస్తుత ఫామ్‌ని దృష్టిలో వుంచుకున్నట్టయితే నాగార్జున ఈ చిత్రాన్ని పూర్తిగా వర్మ అధీనంలో వుంచకపోవచ్చు. అయితే వర్మ కూడా అంత ఈజీగా అవతలి వారిని డామినేట్ చేయనివ్వడు కనుక ఈ కాంబినేషన్‌లో సినిమా ఖచ్చితంగా వార్తల్లో వుంటుందని ఆశించవచ్చు.