Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

వరుణ్‌ తేజ్‌ మరీ అంతకి తెగిస్తాడా?

వరుణ్‌ తేజ్‌ మరీ అంతకి తెగిస్తాడా?

మెగా హీరోలందరిదీ ఒక వరస అయితే తనది మాత్రం సెపరేట్‌ రూట్‌ అని వరుణ్‌ తేజ్‌ ఇప్పటికే నిరూపించుకున్నాడు. మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోలు సహజంగా సేఫ్‌ గేమ్‌ ఆడుతూ వుంటారు. కమర్షియల్‌ ఫార్ములాని వీడి రిస్క్‌ చేయడానికి ఇష్టపడరు.

అయితే ప్రస్తుత ట్రెండ్‌లో ఫార్ములాని నమ్ముకున్నా సక్సెస్‌ గ్యారెంటీ లేదు. అందుకే వరుణ్‌ తేజ్‌ ఎప్పటికప్పుడు రిస్కులు తీసుకుంటూ హీరోగా తనపై ప్రేక్షకులకి ఒక భరోసా కలిగిస్తున్నాడు. ఫిదా, తొలిప్రేమ తర్వాత ఎవరైనా ఇక లవ్‌స్టోరీస్‌కి కట్టుబడిపోతారు.

కానీ వరుణ్‌ తేజ్‌ మాత్రం అంతరిక్షం లాంటి స్పేస్‌ థ్రిల్లర్‌తో పాటు ఎఫ్‌2 అనే కంప్లీట్‌ కామెడీ సినిమా చేస్తున్నాడు. వీటి తర్వాత అతను మరింత పెద్ద ప్రయోగానికి పూనుకుంటున్నాడని టాక్‌ వినిపిస్తోంది. హరీష్‌ శంకర్‌ తీయబోయే చిత్రంలో వరుణ్‌ తేజ్‌ విలన్‌గా నటించడానికి ఓకే చెప్పాడని అంటున్నారు.

తమిళ సినిమా జిగరదండని తెలుగీకరిస్తున్నాడట హరీష్‌ శంకర్‌. ఆ చిత్రంలో బాబీ సింహా చేసిన విలన్‌ పాత్రకి వరుణ్‌ తేజ్‌ని సంప్రదించాడని, అతను కూడా అంగీకారం తెలిపాడని వార్తలు వస్తున్నాయి. ఇంతవరకు వరుణ్‌ లేదా హరీష్‌ ఇద్దరూ ఈ వార్తలని ఖండించలేదు, అలాగని న్యూస్‌ ఖరారు చేయలేదు.

ఒకవేళ నిజంగా వరుణ్‌ తేజ్‌ అంత సాహసానికి పూనుకుంటే ప్రయోగాల విషయంలో మిగిలిన వారి కంటే ఎంతో ముందున్నాడని అనిపించుకుంటాడు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?