cloudfront

Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

వెంకీకి మరో సినిమా దొరికేసింది

వెంకీకి మరో సినిమా దొరికేసింది

సీనియర్ హీరోల్లో విక్టరీ వెంకటేష్ ప్లానింగ్ డిఫెరెంట్ గా వుంటుంది. వైవిధ్యమైన సినిమాలు వెదికి వెదికి తెచ్చుకుని చేస్తున్నాడు దృశ్యం, గురు, గోపాల గోపాల, లేటెస్ట్ గా నారప్ప ఇవన్నీ అలాంటి సినిమాలే. నారప్ప తరువాత వెంకీకి మరో సినిమా దొరికేసినట్లే అనుకోవాలి. ఎందుకంటే వెంకీ చేసిన దృశ్యం సినిమాకు సీక్వెల్ చేయబోతున్నట్లు, ఆ సినిమా మాతృక డైరక్టర్ జీతూ జోసఫ్, ఆ మూవీ హీరో మోహన్ లాల్ ప్రకటించారు. 

దృశ్యం సినిమా మలయాళంలో తయారై దాదాపు అన్ని భారతీయ భాషల్లో రీమేక్ అయింది. అందువల్ల దృశ్యం 2 కు కూడా కచ్చితంగా క్రేజ్ వుంటుంది. పైగా మలయాళంలో మళ్లీ మోహన్ లాల్, మీనా లతోనే ఆ సీక్వెల్ తయారుచేస్తున్నారు. అందువల్ల తెలుగులో చేయాలి అనుకుంటే కనుక వెంకీ-మీనా జోడీనే వుండాలి.

ఆ విధంగా వెంకీ మరో సినిమా కోసం వెదుకులాడాల్సిన పని లేకుండా దొరికేసినట్లే. అయితే ఇదంతా ముందు మలయాళంలో సినిమా రెడీ కావాలి. విడుదలకావాలి. అప్పుటి సంగతి. ప్రస్తుతం చేస్తున్న నారప్ప సినిమా పూర్తి కావడానికే ఇంకా కాస్త ఎక్కువ సమయం పట్టేలా వుంది. కరోనా సంగతి పక్కాగా తెలే వరకు ఆ సినిమా షూట్ స్టార్ట్ కాదు. ఆ తరువాత ఎఫ్ 3 వుండనే వుంది.  ఆ టైమ్ కు దృశ్యం 2 రెడీగా వుంటుందేమో రీమేక్ చేయడానికి. 

మావాడిని టీడీపీ వాళ్ళు తట్టుకోలేరు

 


×