విక్టరీ వెంకటేష్ స్ట్రాటజీ మార్చేసారు. తన దగ్గరకు వచ్చిన వారితో సినిమాలు చేయడం అన్నది పక్కన పెట్టి, నాగార్జున మాదిరిగానే తనే డైరక్టర్లను ఎంచుకుని, కథలు తయారుచేయించుకుని, తన బ్యానర్ పై సినిమాలు చేసే ఆలోచనకు దిగారు. ఈ క్రమంలోనే డైరక్టర్ పూరి జగన్నాధ్ కు కబురు చేసారు.
ఆ ప్రాజెక్టు పట్టాలు ఎక్కాల్సి వుంది. ఆ తరువాత వెంచర్ కు డైరక్టర్ క్రిష్ ను ఎంచుకున్నట్లు విశ్వసనీయ వర్గాల బోగట్టా. ప్రస్తుతం క్రిష్ హీరో బాలకృష్ణ తో గౌతమీ పుత్ర శాతకర్ణి సినిమాను దాదాపు ఫినిష్ చేసారు. ఆయన మరో ఇరవై రోజుల్లో టోటల్ ఫ్రీ అవుతారు. ఆ తరువాత వెంకీతో చేయబోయే కథపై కసరత్తు ప్రారంభిస్తారని తెలుస్తోంది.
ఈ సినిమా క్రిష్ స్వంత బ్యానర్ పైనే తెరకెక్కే అవకాశం వుంది. వెంకీ ఈ మధ్య తన రెమ్యూనిరేషన్ కు బదులుగా శాటిలైట్ రైట్స్ తీసుకుంటున్నారు. గురు సినిమాకు అలాగే చేసారు. బహుశా ఈ సినిమా కూడా అలాగే ప్లాన్ చేస్తారేమో?