విడాకుల బాటన.. సూపర్ స్టార్ కూతురు!

అభిమానులు ఆరాధ్యంగా చూసుకునే రజనీకాంత్ కూడా వాళ్లిద్దరినీ కాంప్రమైజ్ చేయలేకపోయాడట. దీంతో రజనీ తనయ సౌందర్య విడాకులు తీసుకోవడం ఖాయమైనట్టుగా వార్తలు వస్తున్నాయి. భర్త అశ్విన్ నుంచి సౌందర్య విడిపడటం ఖాయమైనట్టు సమాచారం. ఈ…

అభిమానులు ఆరాధ్యంగా చూసుకునే రజనీకాంత్ కూడా వాళ్లిద్దరినీ కాంప్రమైజ్ చేయలేకపోయాడట. దీంతో రజనీ తనయ సౌందర్య విడాకులు తీసుకోవడం ఖాయమైనట్టుగా వార్తలు వస్తున్నాయి. భర్త అశ్విన్ నుంచి సౌందర్య విడిపడటం ఖాయమైనట్టు సమాచారం. ఈ మేరకు వీరు చెన్నై ఫ్యామిలీ కోర్టులో విడాకుల పిటిషన్ దాఖలు చేసినట్టుగా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి అధికారిక ధ్రువీకరణ లేదు. 

ఆరు సంవత్సరాల కిందట సౌందర్య వివాహం జరిగింది. పారిశ్రామిక వేత్త అయిన అశ్విన్ ను ఆమె వివాహం చేసుకుంది. వివాహానంతరం  రజనీకాంత్ తనయ సినిమాలపై దృష్టి సారించింది. రజనీ సినిమాలకు ఆమె పని చేస్తూ వచ్చింది. “కొచ్చాడయాన్’’ కు దర్శకురాలు కూడా సౌందర్యనే. త్వరలోనే మళ్లీ తండ్రిని హీరోగా పెట్టి ఆమె ఒక సినిమాకు దర్శకత్వం వహించే అవకాశాలున్నాయనే వార్తలున్నాయి. 

కానీ ఇంతలోనే ఆమె విడాకుల వార్తలు హైలెట్ అవుతుండటం గమనార్హం. రజనీకాంత్ మరో తనయ ఐశ్వర్య హీరో ధనుష్ ను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. వాళ్లిద్దరూ హ్యాపీ లైఫ్ నే లీడ్ చేస్తున్నారు.  సౌందర్య విషయంలో మాత్రం  ఈ తరహా వార్తలు వస్తున్నాయి. 

సౌందర్య- అశ్విన్ లది ప్రేమ వివాహం.వివాహానికి నాలుగేళ్ల ముందే వీరి మధ్య అనుంబంధం ఉందని సమాచారం. ఈ దంపతులకు ఒక బాబు ఉన్నాడు.