విదేశాల్లో సైజ్ జీరో ఆడియో?

పివిపి బ్యానర్ పై అనుష్క హీరోయిన్ గా వైవిధ్యమైన సినిమా రూపొందిస్తున్నాడు దర్శకుడు ప్రకాష్. ఈ సినిమా దాదాపు పూర్తి కావచ్చింది. ఈ సినిమా అడియో ఫంక్షన్ ను వైవిధ్యంగా, భారీగా జరపాలని అనుకుంటున్నారట.…

పివిపి బ్యానర్ పై అనుష్క హీరోయిన్ గా వైవిధ్యమైన సినిమా రూపొందిస్తున్నాడు దర్శకుడు ప్రకాష్. ఈ సినిమా దాదాపు పూర్తి కావచ్చింది. ఈ సినిమా అడియో ఫంక్షన్ ను వైవిధ్యంగా, భారీగా జరపాలని అనుకుంటున్నారట. ఇటీవల కొత్తగా దూసుకెళ్తున్న ఈవెంట్ మేనేజ్ మెంట్ సంస్థ యువ మీడియా ఈ కార్యక్రమాన్నికౌలాలంపూర్ లేదా మరో చోట చేస్తే ఎలా వుంటుంది అని ఆలోచిస్తోందట. 

అలా అయితే  విదేశాల్లో అడియో ఫంక్షన్ జరుపుకున్న తొలి సినిమా ఇదే అవుతుంది. పివిపి కి ఇటు తమిళ, అటు తెలుగు ఇండస్ట్రీలో మంచి పరిచయాలు, పలుకుబడి వున్నాయి. అందువల్ల ఇరు ఇండస్ట్రీలకు చెందిన వారిని తీసుకువెళ్లి అక్కడ భారీగా ఫంక్షన్ చేయాలని అనుకుంటున్నారట.