సైరా సినిమా వ్యవహారం విగ్గు వచ్చె మొదలాడు అన్నట్లు తయారైందని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా కోసం స్క్రిప్ట్ వర్క్ అయితే అద్భుతంగా తయారుచేసారు. అందులో సందేహం లేదు.
పరుచూరి బ్రదర్స్ ఎప్పుడో బిసి కాలంలో తయారుచేసి, పాతకాలం వాసన వస్తున్న స్క్రిప్ట్ ను దర్శకుడు సురేందర్ రెడ్డి తన చేతుల్లోకి తీసుకుని ఈ జనరేషన్ టేస్ట్ కు తగినట్లు తయారుచేసాడు. అంతవరకు బాగానే వుంది.
కానీ ఏడు నిమషాల టెస్ట్ షూట్ ఫుటేజ్ వచ్చిన తరువాతే మొదలయింది సమస్య. చిరు గెటప్ సరిగ్గా సెట్ కాలేదని, ఫుటేజ్ అంత ఆసక్తి కరంగా లేదని, ఇలా రకరకాల వార్తలు బయటకు వచ్చాయి. సరే, టేకింగ్ అంటే చిరంజీవినే దాదాపు చాలా వరకు దగ్గర వుండి చూసుకుంటారు కాబట్టి ఓకె. మరి గెటప్. అందుకే ఇప్పుడు ఆల్టర్ నేటివ్ ఏర్పాటు ఆలోచిస్తున్నారట.
ఉయ్యాల వాడ నరసింహా రెడ్డి గెటప్ కోసం ఆర్టిస్ట్ ల చేత వేయించిన స్కెచ్ ల ఆధారంగా మాంచి విగ్ సెటప్ చేసినట్లు తెలుస్తోంది. అది చిరంజీవికి బాగానే సూట్ అయినట్లు. దాంతో షూటింగ్ కు వెళ్లిపోవచ్చని డిసైడ్ అయినట్లు బోగట్టా.
ఈ విషయంలో రామ్ చరణ్ తో డిస్కషన్ ఒకటే పెండింగ్ లో వున్నట్లు తెలుస్తోంది. గోదావరి జిల్లాలో పాటల షూట్ లో బిజీగా వున్న రామ్ చరణ్ తిరిగి రాగానే ఈ విషయం ఫిక్స్ చేసి, సైరా షూట్ షెడ్యూలు డిసైడ్ చేస్తారట.