మజిలీ సినిమాతో మరో సినిమాకు మార్గం వేసుకున్న దర్శకుడు శివనిర్వాణ. ఆ తరువాత సినిమా నానితోనా? విజయ్ దేవరకొండతోనా అన్న వార్తలు వినిపిస్తుంటే, ఇంకో లడ్డూ కావాలా నాయనా అన్నట్లుగా, రెండు సినిమాలూ చేతిలోకి వచ్చినట్లు తెలుస్తోంది.
ముందుగా నాని హీరోగా, సాహు నిర్మాతగా ఓ సినిమా చేసేస్తారు. ఆ తరువాత విజయ్ దేవరకొండ రెడీ అవుతారు. విజయ్-పూరి కాంబినేషన్ లో ప్లాన్ చేస్తున్న సినిమా కాగానే శివనిర్వాణ సినిమా వుంటుందని తెలుస్తోంది.
గతంలో ఆ సినిమా తరువాత మైత్రీ మూవీస్ హీరో సినిమా వుంటుందని వార్తలు వచ్చాయి. కానీ అలా కాకుండా శివ నిర్వాణ సినిమానే చేయాలని విజయ్ డిసైడ్ అయినట్లు బోగట్టా.
శివనిర్వాణ-విజయ్ కాంబినేషన్ సినిమాను దిల్ రాజు నిర్మించే అవకాశం వుంది. ఈ సినిమా ఎప్పటి నుంచో డ్యూ. దిల్ రాజ ఎప్పటి నుంచో విజయ్ ను అడుగుతున్నారు. అందువల్ల ఇప్పుడు ఈ కాంబినేషన్ సెట్ అవుతోంది.