విజయ్ తో విక్రమ్ సినిమా

నానీస్ గ్యాంగ్ లీడర్ సినిమాతో బిజీగా వున్నారు డైరక్టర్ విక్రమ్ కె కుమార్. ఈ హడావుడిలోనే తరువాత ప్రాజెక్టు ను కూడా ప్లాన్ చేస్తున్నారు. తరువాత సినిమాను హీరో విజయ్ దేవరకొండతో చేసే ఆలోచనలో…

నానీస్ గ్యాంగ్ లీడర్ సినిమాతో బిజీగా వున్నారు డైరక్టర్ విక్రమ్ కె కుమార్. ఈ హడావుడిలోనే తరువాత ప్రాజెక్టు ను కూడా ప్లాన్ చేస్తున్నారు. తరువాత సినిమాను హీరో విజయ్ దేవరకొండతో చేసే ఆలోచనలో వున్నారు. ఈ మేరకు కొంత వ్యవహారం ముందుకు జరిగినట్లు తెలుస్తోంది. 

ఈ వారంలోనే విక్రమ్ కుమార్ తను విజయ్ కోసం తయారు చేసిన కథను నెరేషన్ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. ఈ స్టెప్ దాటి, విజయ్ ఓకె అంటే సినిమా ఫైనల్ అవుతుంది. ఈ ప్రాజెక్టుకు నిర్మాత కూడా రెడీగా వున్నారు. శరత్ మరార్ ఈ ప్రాజెక్టు కు నిర్మాతగా వుంటారు.

డియర్ కామ్రేడ్, క్రాంతి మాధవ్ సినిమాలు పూర్తి కావస్తున్నాయి. మైత్రీమూవీస్ లోనే బైక్ రేసర్ గా ఓ సినిమా నిర్మాణంలో వుంది. ఈ మూడింటి తరువాత విక్రమ్ కుమార్ సినిమా వుండే అవకాశం వుంది.

సినిమా రివ్యూ: బ్రోచేవారెవరురా  సినిమా రివ్యూ: కల్కి