Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

'విజిల్' వేయించాడుగా..

'విజిల్' వేయించాడుగా..

తమిళ సూపర్ స్టార్ విజయ్ సినిమాలు ఎలా వున్నా అతని యాక్టింగ్, ఆటిట్యూడ్ స్టయిలిష్ గా వుంటుంది. ఇక డైరక్టర్ అట్లీ పక్కా మాస్ పల్స్ పట్టుకున్న డైరక్టర్. ఈ ఇద్దరి కాంబినేషన్ లో వస్తున్న సినిమా విజిల్. దీపావళికి విడుదలవుతున్న ఈ సినిమా ట్రయిలర్ విడుదల చేసారు.

ఫుట్ బాల్ క్రీడ నేపథ్యంలో, వర్తమాన సమాజంలో ఆడపిల్లల సమస్యను అండర్ కరెంట్ మెసేజ్ గా డీల్ చేస్తూ, పక్కా అవుట్ అవుట్ కమర్షియల్ సినిమాగా తయారుచేసినట్లు కనిపిస్తోంది. ట్రయిలర్ లో ప్రతి ఫ్రేమ్ రిచ్ గా, స్టయిలిష్ గా, కమర్షియల్ గా వుంది. రెండు షేడ్స్ లోనూ విజయ్ బాగానే కనిపించాడు.

ఫుట్ బాల్ మ్యాచ్ హిట్టింగ్ సీన్లు విజిల్ వేసేలా చిత్రీకరించినట్లు కనిపిస్తోంది. త్వరలో ఎన్టీఆర్ తో సినిమా చేయబోతున్న దర్శకుడు అట్లీకి ఇది ప్రిలిమనరీ టెస్ట్ లాంటిది. తెలుగులో కూడా ఈ సినిమా పాస్ అయితే అట్లీకి ఇక ఏ అడ్డంకి వుండదు. ట్రయిలర్ కు రెహమాన్ ఇచ్చిన ఆర్ ఆర్ బాగుంది. పాటలు ఏం చేసారో మరి సినిమా వస్తే గానీ తెలియదు. మొత్తం మీద ఓపెనింగ్స్ కు కాస్త సహకరించేలాగే వుంది విజిల్ ట్రయిలర్. తెలుగులో ఈ సినిమాను నిర్మాత మహేష్ కోనేరు తన ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై అందిస్తున్నారు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?