మహర్షి సినిమాకు సంబంధించి అమెరికా షెడ్యూల్ చాలా కీలకమనే విషయం అందరికీ తెలసిందే. టైటిల్ లో స్టాట్యూ ఆఫ్ లిబర్టీ విగ్రహాన్ని పెట్టినప్పుడే, సినిమాలో అమెరికా టచ్ ఉందనే విషయం అందరికీ అర్థమైంది. అయితే అమెరికాతో పాటు ఓ అందమైన పల్లెటూరి కనెక్షన్ కూడా ఉంది మహర్షి సినిమాలో.
ఓవైపు అల్ట్రా మోడ్రన్ గా కనిపించిన మహేష్, మరో షేడ్ లో పల్లెటూరి కుర్రాడిలా కూడా కనిపిస్తాడట. ఈ మేరకు ఓ గ్రామం సెట్ ను తీర్చిదిద్దుతున్నారు. రామోజీ ఫిలింసిటీలో ఈ ప్రత్యేకమైన సెట్ నిర్మాణం కొనసాగుతోంది. అమెరికా షెడ్యూల్ కంప్లీట్ అయిన వెంటనే ఈ విలేజ్ సెట్ లో షెడ్యూల్ మొదలవుతుంది.
అయితే ఇందులో ఏదో ఒక నేపథ్యం, ఫ్లాప్ బ్యాక్ లో వస్తుందట. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో వచ్చేది అమెరికానా లేక పల్లెటూరి ఎపిసోడా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా మహేష్ బాబుకు ప్రతిష్టాత్మక 25వ చిత్రం కావడం విశేషం.
వీసా సమస్యల వల్ల కాస్త ఆలస్యంగా మొదలైంది అమెరికా షెడ్యూల్. ఈ షెడ్యూల్ ను దర్శకుడు అటుఇటుగా 45 రోజులు ప్లాన్ చేశాడట. ఈ షెడ్యూల్ తో సినిమాకు సంబంధించి దాదాపు 40శాతం షూటింగ్ కంప్లీట్ అవుతుందని యూనిట్ భావిస్తోంది.
మహర్షి సినిమాకు సంబంధించి ఇప్పటికే డార్జిలింగ్ లో ఓ భారీ షెడ్యూల్ పూర్తయింది. హైదరాబాద్ లో మరో షెడ్యూల్ కంప్లీట్ అయింది. మధ్యమధ్యలో యాడ్స్, విదేశీ పర్యటనలు కూడా కానిచ్చేశాడు మహేష్. ఇప్పుడు యూఎస్ షెడ్యూల్ స్టార్ట్ అయిందన్నమాట. వచ్చే ఏడాది సమ్మర్ ఎట్రాక్షన్ గా ఏప్రిల్ 5న థియేటర్లలోకి రానున్నాడు మహర్షి.