వినాయక్ కోసం మెగా బహుమతి

సినిమా హిట్ అయితే టాలీవుడ్ హీరోలంతా తమ దర్శకులకు భారీ బహుమతులు ఇవ్వడం కామనే. ఎన్టీఆర్, మహేష్ బాబు కొరటాల శివకు ఇలానే భారీ గిఫ్టులు ఇచ్చారు. ఇప్పుడీ లిస్ట్ లోకి వీవీ వినాయక్…

సినిమా హిట్ అయితే టాలీవుడ్ హీరోలంతా తమ దర్శకులకు భారీ బహుమతులు ఇవ్వడం కామనే. ఎన్టీఆర్, మహేష్ బాబు కొరటాల శివకు ఇలానే భారీ గిఫ్టులు ఇచ్చారు. ఇప్పుడీ లిస్ట్ లోకి వీవీ వినాయక్ కూడా చేరుతున్నాడట. వినాయక్ కు ఓ అదిరిపోయే బహుమతి అందించేందుకు రెడీ అవుతున్నాడట ఖైదీ నంబర్ 150 నిర్మాత రామ్ చరణ్. చిరంజీవి చేతుల మీదుగా ఈ సర్ ప్రైజ్ గిఫ్ట్ ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నాడు.
 
దాదాపు 9 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ సినిమాల్లోకి వచ్చారు చిరంజీవి. ఎన్నో కథలు విన్నారు. ఎంతోమంది దర్శకుల పేర్లు పరిశీలించారు. ఫైనల్ గా వినాయక్ కు తన ప్రతిష్టాత్మక 150వ సినిమాను డైరక్ట్ చేసే ఛాన్స్ ఇచ్చారు. అలా వినాయక్ దర్శకత్వంలో సంక్రాంతి కానుకగా విడుదలైన ఖైదీ నంబర్ 150 సినిమా రీసెంట్ గా 50రోజులు పూర్తిచేసుకుంది. వసూళ్లలో కూడా వంద కోట్ల రూపాయల షేర్ క్రాస్ చేసింది. ఈ సందర్భంగా వినాయక్ కు కాస్ట్ లీ గిఫ్ట్ ఇవ్వాలని అనుకుంటున్నాడట చెర్రీ.
 
శ్రీమంతుడు సినిమా హిట్ అయినందుకు కొరటాలకు ఖరీదైన కారు ప్రజెంట్ చేశాడు మహేష్. అటు ఎన్టీఆర్ కూడా తనకు భారీ విజయాన్నందించిన కొరటాలకు ఫ్లాట్ గిఫ్ట్ గా ఇచ్చాడట. మరి వినాయక్ ఎలాంటి గిఫ్ట్ అందుకోబోతున్నాడు…? కాస్ట్ లీ కారు అందుకుంటాడా లేక ఖరీదైన ఫ్లాట్ దక్కించుకుంటాడా..  అంతకుమించి సర్ ప్రైజ్ సిద్ధంగా ఉందంటూ మెగా కాంపౌండ్ నుంచి లీకులు వస్తున్నాయి.