వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా వున్న హీరో ఎవరు అంటే విశాల్ పేరు టక్కున చెప్పేయచ్చు. సినిమా చేస్తుండగానే మరో సినిమా..ఆ సినిమా స్టార్ట్ చేయగానే ఇంకో సినిమా. ఇలా వుంటుంది పక్కా ప్లానింగ్. అయితే ఎన్ని సినిమాలు చేసినా, స్ట్రయిట్ తెలుగు సినిమా మాత్రం చేయడం లేదు. ఇప్పుడు ఆ లోటు తీర్చుకునే పనిలో వున్నట్లు తెలుస్తోంది.
లౌక్యం,డిక్టేటర్ లాంటి హిట్ లు ఇచ్చిన శ్రీవాస్ డైరక్షన్ లో ఓ మాస్ ఎంటర్ టైనర్ చేసేందుకు విశాల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం చేతిలో వున్న సినిమాలు ఒక కొలిక్కి వచ్చాక, ఫిబ్రవరి నుంచి ఈ సినిమా సెట్ మీదకు వెళ్లే అవకాశం వుంది. ఇప్పటికే చేతిలో రెండు మూడు ప్రాజెక్టులు వున్నాయి విశాల్ కు.
వాటిలో లింగుస్వామి సినిమా, టెంపర్ తమిళ వెర్షన్ కూడా వున్నాయి. ఆ పైన ఇదొకటి. తమిళ తెలుగు మినిమిమ్ మార్కెట్ వుండడమే విశాల్ సినిమాల రహస్యం కావచ్చు.