వివేక్ ఆత్రేయకు కీర్తినో?

కీర్తి సురేష్ ఇప్పుడు ఫుల్ డిమాండ్ లో వుంది. మహానటి తరువాత ఆమె దశతిరిగిపోయింది. లేటెస్ట్ గా రెండు సినిమాలు తెలుగులో ఫినిష్ చేసేసింది. రంగ్ దే, మిస్ ఇండియా సినిమాలు దాదాపు పూర్తయిపోయినట్లే.…

కీర్తి సురేష్ ఇప్పుడు ఫుల్ డిమాండ్ లో వుంది. మహానటి తరువాత ఆమె దశతిరిగిపోయింది. లేటెస్ట్ గా రెండు సినిమాలు తెలుగులో ఫినిష్ చేసేసింది. రంగ్ దే, మిస్ ఇండియా సినిమాలు దాదాపు పూర్తయిపోయినట్లే. రంగ్ దే కొద్దిగా వ‌ర్క్ బ్యాలన్స్ వుంది. మిస్ ఇండియా ఓ సాంగ్ బ్యాలన్స్ వుంది. 

ఇవి కాక తెలుగులో హీరో మహేష్ బాబు సరసన 'సర్కారువారిపాట'  ప్రాజెక్టు ఓకె చేసింది. ఇదిలావుంటే నాని హీరోగా మైత్రీ మూవీస్ నిర్మించే సినిమాకు కీర్తిని తీసుకుందాం అనుకున్నారు. దర్శకుడు వివేక్ ఆత్రేయ స్క్రిప్ఠ్ కూడా నెరేట్ చేసారు. కానీ మరి ఎందుకనో కీర్తి సురేష్ నో చెప్పినట్లు తెలుస్తోంది.

సరైన కథ, క్యారెక్టర్ లేకుంటే కీర్తి సురేష్ సినిమాను ఓకె చేయడం లేదు. మరి వివేక్ ఆత్రేయ ఏం స్క్రిప్ట్ నెరేట్ చేసారో? కీర్తి ఎందుకు నో చెప్పిందొ తెలియాల్సి వుంది. సినిమా రంగంలో ఏ విషయాలూ దాగవు. అందువల్ల ఆ సంగతి కూడా త్వరలో తెలిసే అవకాశం వుంది.

ఈ గడ్డంతో నిద్ర పట్టట్లేదు

మెగాస్టార్ గురించి మీకు తెలీదు