లో బడ్జెట్ సినిమాల హీరోగా మొదలు పెట్టి మీడియం బడ్జెట్ సినిమాలకి సూపర్‌స్టార్‌గా ఎదిగాడు నాని. ప్రస్తుతం అతని సినిమాలు అవలీలగా ముప్పయ్ కోట్ల షేర్ సాధిస్తున్నాయి. కొత్త దర్శకులు, అనుభవం లేని దర్శకులతోనే నాని బాక్సాఫీస్ వద్ద అద్భుతాలు చేస్తున్నాడు. ఇక నాని హీరోగా తదుపరి లెవల్‌కి చేరాలంటే అతనికి స్టార్ డైరెక్టర్ల సపోర్ట్ అవసరం.
ప్రస్తుతం నాని ఆ దిశగానే పావులు కదుపుతున్నాడని, ఇంతకాలం స్టార్ డైరెక్టర్లకి ఎలాంటి ఫీలర్లు పంపని నాని ప్రస్తుతం తనంతట తానుగా 'నాతో సినిమా చేయండి' అంటూ రిక్వెస్టులు పెడుతున్నాడని గుసగుసలు వినిపిస్తున్నాయి.
అంతే కాకుండా స్టార్ హీరోలని దృష్టిలో పెట్టుకుని రాసిన స్క్రిప్టులకి ఆయా హీరోలు అందుబాటులో లేకపోతే నాని తనంతట తానుగా ఆ రచయిత లేదా దర్శకుడిని పిలిచి కథ చెప్పమంటున్నాడట.
వచ్చే ఏడాది వరకు నాని డైరీ ఫుల్ అయిపోయింది కాబట్టి ఆ తర్వాత నుంచి ఈ బడా ప్లాన్స్ అమలు చేసి స్టార్‌గా నెక్స్ట్ లెవల్ని టార్గెట్ చేయడానికి పకడ్బందీ వ్యూహం రెడీ చేస్తున్నాడని సమాచారం.
మరోవైపు యాక్షన్ డోస్ పెంచి మాస్‌కి దగ్గర కావాలనే ప్రయత్నాలు కూడా ఆల్రెడీ స్టార్ట్ చేసాడని, ఇక నుంచి నాని సినిమాల్లో యాక్షన్ మోతాదు ఎక్కువే వుంటుందనే టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తోంది.