రామ్ కు ఇంత తొందరెందుకు..?

ఆల్ మోస్ట్ సొంత బ్యానర్ లోనే సినిమా చేస్తున్నాడు. మరోవైపు పెద్ద సినిమాలతో పోటీ కూడా లేదు. అంతా తనకు అనుకూలంగా ఉన్నప్పటికీ తొందరపడుతున్నాడు రామ్. ఉన్నది ఒక్కటే జిందగీ సినిమాను హడావుడిగా విడుదలకు…

ఆల్ మోస్ట్ సొంత బ్యానర్ లోనే సినిమా చేస్తున్నాడు. మరోవైపు పెద్ద సినిమాలతో పోటీ కూడా లేదు. అంతా తనకు అనుకూలంగా ఉన్నప్పటికీ తొందరపడుతున్నాడు రామ్. ఉన్నది ఒక్కటే జిందగీ సినిమాను హడావుడిగా విడుదలకు ఏర్పాట్లు చేస్తున్నాడు. 

ఈ సినిమాకు సంబంధించి ఇటలీ షెడ్యూల్ తో టోటల్ సినిమా షూటింగ్ పూర్తయిందని చెబుతున్నారు. అయితే ప్యాచ్ వర్క్ మాత్రం ఇంకా పెండింగ్ ఉంది. మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా జరుగుతోంది. సీజీ వర్క్ లేదు కాబట్టి యూనిట్ టెన్షన్ పడడం లేదు. కానీ అటుఇటుగా 2 వారాలు మాత్రమే టైం ఉంది. అక్టోబర్ 27న సినిమాను రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యారు.

ఆఖరి నిమిషయంలో తొందరపడడం వల్ల సినిమా క్వాలిటీపై అది ప్రభావం చూపిస్తుందనే విషయాన్ని పక్కనపెడితే.. ప్రమోషన్ కు మాత్రం టైమ్ దొరకదు. గతంలో శివమ్ విషయంలో కూడా ఇదే పొరపాటు చేశాడు రామ్. లాస్ట్ మినిట్ లో తూతూమంత్రంగా ప్రచారం చేసి సినిమా విడుదల చేసి నెగెటివ్ రిజల్ట్ తెచ్చుకున్నాడు. ఇప్పుడు ఉన్నది ఒక్కటే జిందగీ విషయంలో కూడా అదే పొరపాటు రిపీట్ చేస్తున్నాడేమో అనిపిస్తోంది.

అటు నిర్మాతల వెర్షన్ మాత్రం వేరేలా ఉంది. సినిమాకు సంబంధించి ఇప్పటికే బిజినెస్ పూర్తయిందని చెబుతున్నారు. చివరికి శాటిలైట్ రైట్స్ కూడా అమ్మేశామని.. ఇలాంటి టైమ్ లో సినిమాను ఇంకా తమ చేతుల్లో ఉంచుకోవడం మంచిది కాదనేది ప్రొడ్యూసర్స్ వాదన.