cloudfront

Advertisement


Home > Movies - Movie Gossip

రాజ్ తరుణ్ వల్లకానిది అల్లరోడితో అవుతుందా?

రాజ్ తరుణ్ వల్లకానిది అల్లరోడితో అవుతుందా?

అల్లరినరేష్ కు కొన్నేళ్లుగా సక్సెస్ లేదు. సునీల్ పరిస్థితి కూడా అంతే. ఇక దర్శకుడు భీమనేని శ్రీనివాసరావు గురించి అందరికీ తెలిసిందే. ఇలా ఫ్లాప్ బ్యాచ్ అంతా కలిసి చేస్తున్న సినిమా సిల్లీ ఫెలోస్. ఈ సినిమా హిట్ అయితే వీళ్లకే కాదు, ఇందులో నటిస్తున్న ఓ హీరోయిన్ కు కూడా లైఫ్ దొరుకుతుంది. ఆమె పేరు చిత్ర శుక్లా.

అవును.. అల్లరి నరేష్, సునీల్ తో పాటు ఈమె కూడా ఫ్లాపుల్లో ఉంది. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా వచ్చిన రంగులరాట్నం అనే డబుల్ డిజాస్టర్ సినిమాలో హీరోయిన్ ఈమె. ఆ సినిమా ఫ్లాప్ తర్వాత మరో ఛాన్స్ సంపాదించడానికి అష్టకష్టాలు పడిన ఈ బ్యూటీ, ఎట్టకేలకు సిల్లీ ఫెలోస్ లో అవకాశం దక్కించుకుంది. 

సిల్లీ ఫెలోస్ సక్సెస్ అవ్వడం హీరోలకు ఎంత అవసరమో, ఈమెకు అంతకంటే ఎక్కువ అవసరం. ఎందుకంటే ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి ఏడాది దాటుతున్నా ఇప్పటివరకు బోణీ కొట్టలేదు చిత్ర. కనీసం ఈ సినిమా అయినా హిట్ అయితే చెప్పుకోడానికి బాగుంటుందని పిల్ల ఆశ. రంగులరాట్నం సినిమాతో రాజ్ తరుణ్ ఈమెకు హిట్ ఇవ్వలేకపోయాడు. కనీసం అల్లరినరేష్ అయినా ఆదుకుంటాడేమో చూడాలి.

ఇక సిల్లీ ఫెలోస్ లో ఈమె రోల్ విషయానికొస్తే ఈ సినిమాలో లేడీ పోలీస్ పాత్రలో కనిపించనుంది చిత్ర. అయితే ఇదేదో పవర్ ఫుల్ పాత్ర అనుకోవద్దు. అల్లరినరేష్ చేతిలో సిల్లీగా మోసపోయే పోలీస్ క్యారెక్టర్ ఇది. ఈరోజు థియేటర్లలోకి వచ్చింది ఈ సినిమా.