ఆ మూడు సినిమాల్లో వచ్చేది ఒక్కటే..!

బాహుబలి-2కు పోటీగా వెంటవెంటనే 3 బడా సినిమాలు ఎనౌన్స్ అయ్యాయి. దాదాపు వెయ్యి కోట్ల రూపాయల బడ్జెట్ తో మహాభారతం ప్రాజెక్టును ప్రకటించారు. 500 కోట్ల రూపాయల బడ్జెట్ తో రామాయణం ప్రాజెక్ట్ ప్రకటించారు…

బాహుబలి-2కు పోటీగా వెంటవెంటనే 3 బడా సినిమాలు ఎనౌన్స్ అయ్యాయి. దాదాపు వెయ్యి కోట్ల రూపాయల బడ్జెట్ తో మహాభారతం ప్రాజెక్టును ప్రకటించారు. 500 కోట్ల రూపాయల బడ్జెట్ తో రామాయణం ప్రాజెక్ట్ ప్రకటించారు నిర్మాత అల్లు అరవింద్. ఈ మధ్య కేన్స్ చిత్రోత్సవంలో సంఘమిత్ర సినిమాను గ్రాండ్ గా లాంచ్ చేశారు. ఈ మూవీ బడ్జెట్ కూడా అటుఇటుగా 250 కోట్ల రూపాయలు అంటున్నారు. ఇలా షార్ట్ గ్యాప్ లో వచ్చిన ఈ 3 బడా సినిమాల్లో సెట్స్ పైకి వచ్చేది మాత్రం ఒక్కటే అని టాక్.

తాజా సమాచారం ప్రకారం, సంఘమిత్ర మాత్రమే ప్రస్తుతానికి సెట్స్ పైకి వచ్చే అవకాశాలున్నాయి. దీనికి సంబంధించి శృతిహాసన్ ఇప్పటికే లండన్ లో ట్రయినింగ్ తీసుకుంది. హీరోలు కూడా రెడీగా ఉన్నారు. డైరక్టర్ సుందర్ కూడా స్క్రీన్ ప్లే పూర్తిచేశాడట. ఏదేమైనప్పటికీ ఈ సినిమాకు సంబంధించి ఏదో ఒక అప్ డేట్ అయితే కనిపిస్తోంది. కానీ మిగతా సినిమాల విషయంలో అది కనిపించడం లేదు.

యూఏఈకి చెందిన వ్యాపారవేత్త వెయ్యి కోట్ల బడ్జెట్ ఇస్తానని చెప్పడంతో మహాభారతం ప్రాజెక్టును అఫీషియల్ గా ఎనౌన్స్ చేశారు. కానీ ఆ మూవీకి సంబంధించి ఎవరూ ఏం మాట్లాడ్డం లేదు. మరోవైపు అల్లు అరవింద్ కూడా రామాయణం సినిమాను లైట్ తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాలో రాముడిగా రామ్ చరణ్ అంటూ చాలా ఫొటోషాప్ స్టిల్స్ బయటకొచ్చాయి.

అయితే రామాయణం సినిమా ఆ ఫొటోషాప్ తోనే ఆగిపోయింది. కనీసం ఈ సినిమా దర్శకుడు ఎవరనే విషయాన్ని కూడా ప్రకటించలేదు. సో.. భారీ హైప్ క్రియేట్ చేస్తూ తెరపైకొచ్చిన ఈ సినిమాల్లోంచి ప్రస్తుతానికి 2 డ్రాప్ అయినట్టే కనిపిస్తున్నాయి.