250కోట్ల రూపాయలతో సంఘమిత్ర లాంటి భారీ బడ్జెట్ సినిమాను ప్రకటించింది తేనాండాళ్ సంస్థ. దర్శకత్వ బాధ్యతల్ని సి.సుందర్ కు అప్పగించింది. ఆర్య, సత్యరాజ్ లాంటి నటుల్ని కూడా తీసుకున్నారు. ఏకంగా కేన్స్ ఫిలిం ఫెస్టివల్ లో ఈ సినిమాను లాంచ్ చేశారు. కానీ కీలకపాత్ర పోషించాల్సిన శృతిహాసన్ హ్యాండ్ ఇవ్వడంతో సంఘమిత్ర ప్రాజెక్టు వెనక్కి వెళ్లిపోయింది.
శృతిహాసన్ స్థానంలో చాలామంది హీరోయిన్లను ప్రయత్నించారు. రీసెంట్ గా హన్సిక కూడా ఈ సినిమాను తను చేయడం లేదంటూ ప్రకటించింది. ఇలా మెయిన్ లీడ్ దొరక్క సతమతమవుతున్న దర్శకుడు సుందర్ సి.. ఇప్పుడు తను కూడా ఈ ప్రాజెక్టు నుంచి కాస్త పక్కకు జరగాలని అనుకుంటున్నాడు.
సంఘమిత్ర సినిమా సెట్స్ పైకి వచ్చేలోపు మరో సినిమా స్టార్ట్ చేయాలని భావిస్తున్నాడు ఈ దర్శకుడు. ఐదేళ్ల కిందట తను తీసిన సూపర్ హిట్ మూవీ కలకళప్పుకు సీక్వెల్ తీయాలనుకుంటున్నాడు. ఆ సినిమాలో నటించిన అంజలి, ఒవియాలనే హీరోయిన్లుగా సెలక్ట్ చేసుకున్నాడు. ఈ సినిమాతోనే సంతానంకు స్టార్ డమ్ వచ్చింది.
సుందర్ సి కనుక ఈ సీక్వెల్ ప్రారంభిస్తే సంఘమిత్ర ప్రాజెక్టు మరింత వెనక్కి వెళ్లడం ఖాయం. ఎందుకంటే అన్నీ దగ్గరుండి చూసుకోవాల్సిన దర్శకుడే మెయిన్ ట్రాక్ నుంచి తప్పుకుంటే ఇక సినిమా దాదాపు ఆగిపోయినట్టే. మరి దీనిపై తేనాండాళ్ నిర్మాణ సంస్థ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.