అశోక్ చాలారోజులు శ్రమపడ్డాడు. కానీ మెప్పించలేకపోయాడు. కిషోర్ తిరుమల ఫుల్ స్క్రీన్ ప్లే పట్టుకొని తెగ తిరిగాడు. కానీ వర్కవుట్ కాలేదు. రీసెంట్ గా తేజ అయితే సినిమా స్టార్ట్ చేసి మరీ డ్రాప్ అయిపోయాడు. ఇలా వెంకీతో సినిమా చేసేందుకు ప్రయత్నించిన దర్శకులందరూ ఫెయిల్ అయ్యారు. ఇప్పుడు తాజాగా త్రినాథరావు నక్కిన ఎంటరయ్యాడు.
త్రినాథరావు నక్కిన, కథా రచయిత బెజవాడ ప్రసన్నకుమార్ కలిసి వెంకీకి ఓ స్టోరీలైన్ వినిపించారు. పోలీసాఫీసర్ బ్యాక్ డ్రాప్ లో నడిచే సినిమా అది. కథ పోలీస్ దే అయినా కామెడీ కామన్ అట. అలాంటి హిలేరియస్ మూవీలో నటించేందుకు వెంకీ ఓకే అన్నాడట. ఫుల్ లెంగ్త్ స్క్రీన్ ప్లే రాసుకొని రమ్మన్నాడట.
వెంకీ చెప్పడమే ఆలస్యం, యూనిట్ లో కీలక సభ్యులు ముగ్గురు గోవా వెళ్లిపోయారు. స్టోరీ, స్క్రీన్ ప్లే రాసే పనిలో బిజీ అయిపోయారు. అయితే వీళ్లు రాసిన స్క్రీన్ ప్లేకు వెంకటేష్ ఓకే చెబుతాడా అనేది అందర్లో ఉన్న సందేహం.
ఇంతకుముందు చెప్పుకున్న దర్శకులు కూడా పూర్తి స్క్రీన్ ప్లేతోనే కలిశారు. కానీ మెప్పించలేకపోయారు. దీనికి కారణం సురేష్ బాబు. మంచి కథతో పాటు మినిమం బడ్జెట్ లో పూర్తయ్యే స్క్రిప్ట్ కోరుకుంటున్నాడు ఈ నిర్మాత. అక్కడే సమస్య ఎదురవుతోంది. చూద్దాం, ఈసారి త్రినాథరావు నక్కిన ఏం చేస్తాడో?