సాధారణంగా టాలీవుడ్ లో ఓ సంప్రదాయం వుంది. సినిమా డిజాస్టర్ అయితే, బయ్యర్లు కుదేలు అయిపోతే, నిర్మాత ఎంతో కొంత వెనక్కు ఇవ్వడం. నిర్మాతతో పాటు హీరో కూడా ఎంతో కొంత రిటర్న్ ఇవ్వడం. గతంలో పవన్ కళ్యాణ్, మహేష్ వంటి హీరోలు ఈ సంప్రదాయాన్ని పాటించారు. అజ్ఞాతవాసి, బ్రహ్మోత్సవం సినిమాల విషయంలో ఇలా జరిగింది.
డియర్ కామ్రేడ్ అనే సినిమా ఫ్లాప్ అయింది. అయితే ఓపెనింగ్స్ గట్టిగా లాగారు కాబట్టి, నిర్మాతలు కొంత వరకు బయ్యర్లను ఆదుకున్నారు. హీరో విజయ్ వరకు వ్యవహారం వెళ్లలేదు. కానీ గతవారం విడుదలయిన వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా వ్యవహారం అలా కాదు. అటు నిర్మాత, ఇటు బయ్యర్లు దారుణంగా కుదేలయిపోయారు. ఇప్పుడు బయ్యర్లు ను ఆదుకునే పొజిషన్ లో నిర్మాత కూడా లేరు. ఇక మిగిలిన ఆప్షన్ విజయ్ దేనరకొండ మాత్రమే.
కానీ ఆయన అస్సలు ఆ వ్యవహారామే పట్టనట్లు వున్నారు. పైగా ఆ సినిమా వైఫల్యానికి కారణం తను కాదు, డైరక్టర్ క్రాంతిమాధవ్ దే అంతా అనే విధంగా వార్తలను మీడియాలో స్ప్రెడ్ చేయడంలో మాత్రం హుషారుగా వున్నట్లు కనిపిస్తోంది. కానీ నిర్మాత కేఎస్ రామారావు మాత్రం ఓసారి విజయ్ దేవరకొండను కలిసి బయ్యర్లను ఆదుకునే విషయం చర్చించాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు బయ్యర్లను ఏదో విధంగా ఎంతో కొంత ఆదుకోకపోతే, భవిష్యత్ లో కెఎస్ రామారావు సినిమాలు తీయడం ఇబ్బంది అవుతుంది.
కానీ విజయ్ దేవరకొండ సానుకూలంగా స్పందించే అవకాశం లేదని ఇండస్ట్రీ ఇన్ సైడ్ వర్గాల టాక్. ఎందుకంటే ఇప్పటికే కెఎస్ రామారావు కొంత రెమ్యూనిరేషన్ బకాయి పెట్టి, దానికి బదులు ఏదో ఫ్లాట్ పేపర్స్ ఇచ్చారని టాక్ వుంది. మరి ఇక తనకే రెమ్యూనిరేషన్ పూర్తిగా అందనపుడు విజయ్ ఏం చేస్తారు?