సంక్రాంతి అంటేనే బడా సినిమాల సీజన్. పెద్ద సినిమాలు హోరాహోరీగా తలపడే సీజన్. అలాంటి టైమ్ లో మీడియం రేంజ్, స్మాల్ బడ్జెట్ సినిమాలు రావడానికి భయపడతాయి. అలాంటిది ఓ డబ్బింగ్ సినిమా వస్తుందంటే నమ్మగలమా..? ప్రస్తుతానికైతే నమ్మాల్సిందే. అవును.. హీరో విశాల్ ఈసారి సంక్రాంతి బరిలో నిలిచాడు.
ప్రస్తుతం తమిళ్ లో ఇరింబు తిరై అనే సినిమా చేస్తున్నాడు విశాల్. సమంత హీరోయిన్ గా నటిస్తోంది. యాక్షన్ స్టార్ అర్జున్ ఓ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఈ సినిమాను జనవరి 13న విడుదల చేయబోతున్నట్టు ప్రకటించాడు విశాల్. డిటెక్టివ్ హిట్ తో ఊపుమీదున్న ఈ హీరో.. తన నెక్ట్స్ సినిమాకు అభిమన్యుడు అనే టైటిల్ ఫిక్స్ చేశాడు.
సంక్రాంతి బరిలో కూడా సర్ ప్రైజ్ హిట్స్ ఉన్నాయి. ఎక్స్ ప్రెస్ రాజా, శతమానం భవతి లాంటి సినిమాలు సైలెంట్ గా వచ్చి సక్సెస్ అందుకున్నాయి. ఇదే దారిలో అభిమన్యుడు కూడా హిట్ అయిపోతుందని విశాల్ ఆశపడుతున్నాడు. కానీ పవన్ కల్యాణ్, బాలకృష్ణ సినిమాల మధ్య విశాల్ కు ఎన్ని థియేటర్లు దక్కుతాయనేది పెద్ద ప్రశ్న.