సల్మాన్ కు చాలా మంది చెల్లెల్లు ఉన్నారు. సొంత చెల్లెలు, ఇంటికి దత్తతగా వచ్చిన చెల్లెలు. ఇంకా ఆయన ఒక అమ్మాయికి కన్యాదాత గా కూడా కూర్చొన్నాడు. రాఖీ కట్టించుకున్న అనుబంధంతో శ్వేత రోహిరా అనే లేడీ జర్నలిస్టుకు పెళ్లి చేశాడు సల్లూ. నటుడు పుల్కిత్ సమ్రాట్ తో ఆమె వివాహానికి సల్లూ కన్యాదాతగా వ్యవహరించాడు. గత ఏడాది వీరి పెళ్లి అయ్యిందో లేదో కానీ.. అప్పుడే వీళ్ల మధ్య కలతలు వచ్చినట్టుగా తెలుస్తోంది. ఈ కలతలకు కారణం యామీ గౌతమ్. ఇటీవలే నితిన్ కొరియర్ బాయ్ కల్యాన్ లో కనిపించి హిట్ ను దక్కించుకోలేకపోయిన ఈ భామ… ఇప్పుడు పుల్కిత్ తో డేటింగ్ లో ఉందని వార్తలు వస్తున్నాయి.
వీళ్ల గురించి రూమర్లు కొంచెం పాతవే అయినా.. ఇటీవల యామీ పుట్టిన రోజు సందర్భంగా జరిగిన సంఘటనలు, శ్వేత రోహిరా కూడా.. తమ దాంపత్యం కొంచెం ఇబ్బందుల్లో ఉందని ధ్రువీకరించడం చూస్తుంటే.. సల్లూ రాఖీ చెల్లి కాపురంలో యామీ నిప్పులు పోస్తోందనే అభిప్రాయాలు ధ్రుడపడుతున్నాయి. ఫేర్ అండ్ లవ్లీ యాడ్స్ తప్ప పెద్దగా అవకాశాలు లేని యామీ.. కి ఇప్పుడు తోడు అయితే అవసరం కావొచ్చు… కానీ కొత్తగా పెళ్లైన నటుడితో డేటింగ్ ఏంటి అని అనేకమంది ఆశ్చర్యపోతున్నారు. వీరి రూమర్ గురించి శ్వేతా దగ్గర ప్రస్తావిస్తే.. తను ఈ రూమర్ ను నమ్మడం లేదని అంటోంది కానీ… విడాకుల ప్రస్తావన కూడా తనే తెస్తోంది!
ఇక పుల్కిత్ మాత్రం యామీతో దిగిన సెల్ఫీలు నెట్ లో పెడుతున్నాడు.. ఆమె పుట్టిన రోజుకు సోషల్ నెట్ వర్కింగ్ సైట్లో విషెష్ చెప్పాడు. ఇలా ఏ విధంగా చూసినా.. యామీ, పుల్కిత్ లు అనుమానాలకు తావిస్తున్నారు. అయితే మరీ వివాహం అయ్యి ఏడాది కూడా గడవకుండానే.. ఇలాంటి వార్తలు రావడం, అందునా యామీ లాంటి హీరోయిన్ ఈ రూమర్లలో నానడం మాత్రం బాలీవుడ్ జనాలకు స్పైసీగా మారింది!