నిన్న అనుష్క శర్మ.. రేపు శృతిహాసన్

ఇప్పుడంతా ఇదే యాంగిల్ లో చర్చించుకుంటున్నారు. విరాట్ కోహ్లి, అనుష్క పెళ్లి చేసుకున్న తర్వాత అందరి దృష్టి ఇప్పుడు శృతిహాసన్ పై పడింది. అనుష్క శర్మ టైపులోనే శృతిహాసన్ కూడా ఏ క్షణానైనా సీక్రెట్…

ఇప్పుడంతా ఇదే యాంగిల్ లో చర్చించుకుంటున్నారు. విరాట్ కోహ్లి, అనుష్క పెళ్లి చేసుకున్న తర్వాత అందరి దృష్టి ఇప్పుడు శృతిహాసన్ పై పడింది. అనుష్క శర్మ టైపులోనే శృతిహాసన్ కూడా ఏ క్షణానైనా సీక్రెట్ గా పెళ్లి చేసుకొని షాక్ ఇస్తుందని అంతా వెయిటింగ్.

దాదాపు రెండేళ్లుగా బ్రిటన్ నటుడు మైఖేల్ కోర్సల్ తో డేటింగ్ చేస్తోంది శృతిహాసన్. ప్రారంభంలో తనే లండన్ వెళ్లేది. ముద్దుముచ్చట అన్నీ అక్కడే. కానీ ఇప్పుడు ట్రెండ్ మార్చింది. అతడ్నే ఇండియాకు తీసుకొచ్చింది. తన తల్లి సారిక, తండ్రి కమల్ హాసన్ కు పరిచయం కూడా చేసింది.

రీసెంట్ గా వీళ్లిద్దరూ కలిసి చెన్నైలో ఓ వివాహానికి కూడా హాజరయ్యారు. అక్కడ కమల్ హాసన్ తో కలిసి కోర్సల్ ఫొటోలు/సెల్ఫీలు కూడా దిగాడు. సో.. “శృతికోర్సల్” వ్యవహారం కూడా ఇప్పుడు ఓపెన్ సీక్రెట్ అయింది. ముంబయిలో ఇద్దరూ కలిసి నైట్ పార్టీలకు వెళ్తున్నారు. ఆ ఫొటోల్ని షేర్ చేస్తున్నారు కూడా.

తాజాగా వినిపిస్తున్న గాసిప్స్ ఏంటంటే.. వచ్చే ఏడాది శృతిహాసన్, కోర్సల్ పెళ్లిచేసుకుంటారట. ఆమె సినిమాలు తగ్గించేయడం ఈ పుకార్లకు మరింత ఊతమిస్తోంది. విరాట్, అనుష్క శర్మలా.. వీళ్లిద్దరు కూడా ఎటైనా దూరంగా పారిపోయి పెళ్లి చేసుకొని దానికి “డెస్టినేషన్ వెడ్డింగ్” అని పేరుపెడతారేమో.