హీరోయిన్ అన్నాక నాజూగ్గా కనిపించాలి. ఊరికే తిని తొంగుంటే అసలుకే మోసం వస్తుంది కాబట్టి కాస్త ఒళ్లు వంచి వర్కవుట్లు చెయ్యక తప్పదంటుంది ప్రణీత. ‘అత్తారింటికి దారేది’ సినిమాతో వచ్చిన క్రేజ్నీ, ఇప్పుడు చేస్తున్న సినిమాలనూ కంటికి రెప్పలా కాపాడుకోవడానికి ప్రస్తుతం యోగాని ఆశ్రయించిందట. గతంలో డాన్స్, జాగింగ్, సైక్లింగ్ చేసినప్పటికీ యోగా చెయ్యడంలో ఉన్నంత తృప్తి ఇంకెందులోనూ లేదంటుంది.
యోగా చెయ్యడానికి ప్రత్యేకించి గురువుని పెట్టుకోకపోయినా గతంలో సీనియర్ హీరోయిన్ రేఖ చేసిన యోగా క్లాసుల వీడియోనూ, శిల్పా శెట్టి చేసిని యోగా ఆల్బమ్నూ ఫాలో అవుతుందట. యోగా చేస్తే ఒక్క శరీరమే కాదు మిగతా అన్ని ఎమోషన్స్ కూడా అదుపపులో ఉంటాయంటుంది. ముఖ్యంగా నా శరీర ఆకృతికి మొదట్లో యోగా భంగిమలు సహకరించలేదు. అయినా సరే ప్రాక్టీస్ చెయ్యడంతో అలవాటు పడ్డాను. అయితే యోగాకు ఎక్కువ టైం కేటాయించాల్సి ఉంటుంది. కంగారుగా చేస్తే ఫలితాలు ఉండవు. నేను ఇంకా ఎన్నో సినిమాలు చేయాలి.
అలాంటప్పుడు శరీరాన్ని అదుపులో పెట్టుకోవడం ఎంతో అవసరం. ఆహార నియమాలు సరే.. అనవసర కొవ్వును తగ్గించుకోవడానికి శరీరాన్ని కష్టపెట్టాలంటున్న ప్రణీతను చూస్తుంటే యోగాని నిష్ఠగా చేస్తున్నట్లు కనిపించడంలేదు. సిలెండర్లా ఉనన ఆమె బాడీని చూస్తే ఆవిడ చెప్పేవన్నీ నిజమని అనిపించకపోవచ్చు కానీ.. యోగా గొప్పతనాన్ని గుర్తించిన మాట నిజం.