‘జిందగీ’ కి రామ్ కోతలు?

ఉన్నది ఒకటే జిందగీ సినిమా ట్రయిలర్ బయటకు వచ్చింది. డిఫరెంట్ గా వుందన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అయింది. సాధారణంగా తన సినిమాల మేకింగ్ లో హీరో రామ్ కాస్త ఎక్కువగానే జాగ్రత్తలు తీసుకుంటారని…

ఉన్నది ఒకటే జిందగీ సినిమా ట్రయిలర్ బయటకు వచ్చింది. డిఫరెంట్ గా వుందన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అయింది. సాధారణంగా తన సినిమాల మేకింగ్ లో హీరో రామ్ కాస్త ఎక్కువగానే జాగ్రత్తలు తీసుకుంటారని వార్తలు వినిపిస్తూనే వుంటాయి. అది కామన్ అయిపోయింది. ఇప్పుడు ఈ సినిమా మేకింగ్ మీద కూడా రామ్ దృష్టి పెట్టినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.

సినిమాలో హీరో రామ్ తో పాటు మరో అప్ కమింగ్ హీరో శ్రీ విష్ణుకు కూడా ఫుల్ లెంగ్త్ మంచి క్యారెక్టర్ పడింది. కథ ప్రకారం హీరో స్నేహితుడిగా కీలకం కూడానూ. అయితే ఇప్పుడు సినిమా అంతా అయిపోయాక, చూసుకుంటే హీరో క్యారెక్టర్ కన్నా శ్రీవిష్ణు క్యారెక్టర్ ఎక్కువ ఎలివేట్ అయినట్లు కనిపిస్తోందని వినికిడి. 

దీంతో ఇప్పుడు ఆ మేరకు కాస్త కోతలు కోసి, సినిమాను హీరోకి సరైన ప్రాధాన్యత వుండేలా సెట్ చేసే ప్రయత్నాలు రామ్ చేస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే చాలా వరకు శ్రీవిష్ణు సన్నివేశాలు కీలకమైనవి కావడంతో అలా చేయడం అన్నది కాస్త ఇబ్బందిగానే వుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఎంత వరకు నిజమో? మరి?