Advertisement

Advertisement


Home > Movies - Movie News

హైప్ ఎక్కువ.. అడ్వాన్స్ బుకింగ్స్ తక్కువ

హైప్ ఎక్కువ.. అడ్వాన్స్ బుకింగ్స్ తక్కువ

'ది' దేవరకొండ నటించిన చిత్రం.. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మాత.. గీతగోవిందం కాంబినేషన్ రిపీట్.. సీతారామం ఫేమ్ మృణాల్ హీరోయిన్.. సర్కారువారి పాట తర్వాత పరశురామ్ నుంచి వస్తున్న సినిమా.. ఇలా ఫ్యామిలీ స్టార్ చుట్టూ చాలా హైప్ ఉంది. అయితే ఈ హైప్ అంతా చెప్పుకోవడం వరకే. అడ్వాన్స్ బుకింగ్స్ లో అది కనిపించలేదు.

అవును.. మరికొన్ని గంటల్లో థియేటర్లలోకి రాబోతున్న ఫ్యామిలీ స్టార్ సినిమాకు సంబంధించి అడ్వాన్స్ బుకింగ్స్ లో ఆశించిన స్థాయి జోరు కనిపించలేదు. ఇలా బుకింగ్స్ ఓపెన్ అవ్వగానే అలా, స్క్రీన్ మొత్తం ఎరుపు రంగులోకి లేదా ఫుల్ అనే నోటిఫికేషన్ కనిపిస్తుందని చాలామంది ఆశించారు. కానీ ఇప్పటికీ బుక్ మై షోలో చాలా స్క్రీన్స్ లో పచ్చదనం (ఖాళీ సీట్లు) కనిపిస్తోంది.

ఏఎంబీ సినిమాస్, ప్రసాద్స్ మినహా.. హైదరాబాద్ లోని దాదాపు అన్ని మల్టీప్లెక్సుల్లో బుకింగ్స్ ఆశించిన స్థాయిలో లేవు. సిటీ శివార్లలోని మల్టీప్లెక్సుల్లో 30శాతం ఆక్యుపెన్సీ కూడా కనిపించలేదు. చివరికి ప్రసాద్స్ మల్టీప్లెక్సులో కూడా ఓపెనింగ్ రోజు కొన్ని షోలు ఖాళీగా చూపిస్తున్నాయి.

కేవలం హైదరాబాద్ లోనే కాదు, విశాఖపట్నం, తిరుపతిలో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఇక విజయవాడ సిటీలో మరీ దారుణం. 9 మల్టీప్లెక్సులతో కలిపి 17 థియేటర్లలో బుకింగ్స్ ఓపెన్ అయితే, ఒక్క షో కూడా ఫుల్ అవ్వలేదు. తెలుగు రాష్ట్రాల్లో మిగతా పట్టణాలతో పాటు, కర్నాటక-తమిళనాడు సంగతి సరేసరి.

యూత్ లో విపరీతమైన ఫాలోయింగ్ ఉన్న విజయ్ దేవరకొండ సినిమాకు ఇంత తక్కువ రెస్పాన్స్ ఎవ్వరూ ఊహించలేదు. కానీ ఇదే నిజం.

ఇప్పుడీ సినిమా పూర్తిగా కంటెంట్ పై ఆధారపడింది. ముందు సినిమా క్లిక్ అవ్వాలి. టిల్లూ స్క్వేర్ కు పోటీగా నిలబడాలి. 100 కోట్లు, 200 కోట్ల వసూళ్లు ఆ తర్వాత సంగతి.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?