2020 ట్విట్టర్ ట్రెండ్స్: వీళ్లదే హవా

ఈ కాలం ట్విట్టర్ లో ఎంత ట్రెండ్ అయితే అంత క్రేజ్ ఉన్నట్టు లెక్క. మరి 2020లో ఎక్కువగా ట్రెండ్ అయిన హీరోలు ఎవరు? హీరోయిన్లు ఎవరు? ఎక్కువగా డిస్కషన్ లోకి వచ్చిన సినిమాలేంటి?…

ఈ కాలం ట్విట్టర్ లో ఎంత ట్రెండ్ అయితే అంత క్రేజ్ ఉన్నట్టు లెక్క. మరి 2020లో ఎక్కువగా ట్రెండ్ అయిన హీరోలు ఎవరు? హీరోయిన్లు ఎవరు? ఎక్కువగా డిస్కషన్ లోకి వచ్చిన సినిమాలేంటి? దీనిపై ట్విట్టర్ ఓ లిస్ట్ రిలీజ్ చేసింది.

ఈ ఏడాది ట్విట్టర్ లో ఎక్కువగా మాట్లాడుకున్న హీరోల జాబితాలో మహేష్ బాబు అందరికంటే ముందున్నాడు. ట్విట్టర్ లో ఎక్కువగా మహేష్ గురించే మాట్లాడుకున్నారట. ఈ తర్వాత స్థానంలో పవన్ కల్యాణ్, మూడో స్థానంలో తమిళ నటుడు విజయ్ ఉన్నారు. ఈ ముగ్గురు నటుల హ్యాష్ ట్యాగ్స్ ఎక్కువగా ట్రెండ్ అయ్యాయి. 

ఇక 2020లో ఎక్కువగా ట్వీట్లు పొందిన హీరోయిన్లలో అగ్రస్థానంలో కీర్తిసురేష్ నిలిచింది. ఈమెకు సంబంధించిన వ్యక్తిగత విషయాలు, సినిమాల గురించి ఎక్కువ ట్వీట్లు పడ్డాయి. అంతేకాదు.. ట్విట్టర్ లో ఎక్కువమంది ప్రశ్నించింది కూడా కీర్తిసురేష్ నే. ఈ లిస్ట్ లో రెండో స్థానంలో కాజల్, మూడో స్థానంలో సమంత నిలిచారు.

సినిమాల విషయానికొస్తే.. ఇంకా రిలీజ్ కాని మాస్టర్, వకీల్ సాబ్ సినిమాలు ఎక్కువగా ట్వీట్లు పొందాయి. చాన్నాళ్లుగా షూటింగ్ జరుపుకోవడంతో పాటు లాక్ డౌన్ కారణంగా మధ్యలో బ్రేక్ రావడంతో.. ఎక్కువగా ట్విట్టర్ లో ఈ రెండు సినిమాల హ్యాష్ ట్యాగ్సే పాపులర్ అయ్యాయి. ఇక మూడో స్థానంలో వళిమై, నాలుగో స్థానంలో సర్కారువారి పాట సినిమాలు నిలిచాయి.

2020 ఎక్కువగా ట్వీట్స్ పొందిన హీరోలు
1. మహేష్ బాబు
2. పవన్ కల్యాణ్
3. విజయ్
4. ఎన్టీఆర్
5. సూర్య

2020లో ఎక్కువగా ట్వీట్స్ పొందిన హీరోయిన్లు
1. కీర్తిసురేష్
2. కాజల్ అగర్వాల్
3. సమంత
4. రష్మిక
5. పూజా హెగ్డే

2020లో ఎక్కువగా చర్చించుకున్న సినిమాలు
1. మాస్టర్
2. వకీల్ సాబ్
3. వళిమై
4. సర్కారువారిపాట
5. సురారై పొట్రు

పోలవరం ప్రాజెక్టు పనులను పరిశీలించిన సీఎం జగన్