Advertisement

Advertisement


Home > Movies - Movie News

4న విజయవాడలో బాలయ్య సభ

4న విజయవాడలో బాలయ్య సభ

దసరా ముందు రోజు విజయవాడలో భారీ బహిరంగ సభ జరగబోతోంది. తొలిసారి ఓ ఓటిటి కార్యక్రమానికి ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగబోతోంది. సీనియర్ హీరో బాలకృష్ణ సూపర్ హిట్ చాట్ షో .. ఆహా... అన్ స్టాపబుల్ సీజన్ 2 కు ప్రీ రిలీజ్ ఈవెంట్ గా విజయవాడలో భారీ సభకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. 

ఈ రోజు హైదరాబాద్ లో ప్రోమో షూట్ ను చేసారు. ప్రశాంత్ వర్మ డైరక్షన్ లో కొంత పార్ట్ ను సారథి స్టూడియోలో, మరి కొంత పార్ట్ ను అన్నపూర్ణ సెట్ లో షూట్ చేసారు. బాలయ్య డిఫరెంట్ గెటప్ లో ఈ షూట్ లో పాల్గొన్నారు.

సీజన్ 2 కోసం చాలా గట్టి ప్లాన్ లు వేస్తున్నారు. తొలి సిరీస్ కు పనిచేసిన రైటింగ్ టీమ్ నే సీజన్ 2 కూడా పని చేస్తోంది. చంద్రబాబు-లోకేష్, త్రివిక్రమ్-పవన్ ఇలాంటి మాంచి కాంబినేషన్లు సెట్ చేసేందుకు టీమ్ ప్రయత్నిస్తోంది. తొలి ఎపిసోడ్ చంద్రబాబు-లోకేష్ దే వుండే అవకాశం వుంది. ఇటు బాలయ్య, అటు తెలుగుదేశం అభిమానులు అంతా ఈ ఎపిసోడ్ కోసమైనా చానెల్ ను సబ్ స్క్రయిబ్ చేసుకోవాల్సి వుంది.

ఆహా ఓటిటి సంస్థకు ఈ చాట్ షో ప్రాణవాయువులా పని చేస్తుందని గట్టిగా నమ్ముతున్నారు. అందుకే ఇంత భారీగా బహిరంగ సభ ప్లాన్ చేస్తున్నారు. కనీసం ఇరవై నుంచి ముఫై వేల మంది ఫ్యాన్స్ ఈ సభకు హాజరవుతారని అంచనా వేస్తున్నారు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?