ఇస్మార్ట్ శంకర్ లో అమ్మడు అందాలు ఆరబోసింది. సినిమా పెద్ద హిట్ అయింది. అదే చూసారు. అదే అనుకుంటున్నారు. అందులో మిగిలిన అంశాలు ఎలా వున్నాయి అన్నది అనవసరం అయిపోయింది. దాంతో ఆర్జీవీ బ్యూటిఫుల్ అనే సినిమా తీసారు. అమ్మాయి అందాలు ఎంతలా బయటపెట్టాలో అంతా చేసారు. ఎన్ని భంగమల్లో చూపించాలో అంతా చూపించారు. బి సి సెంటర్లలో ఇంతో అంతో వసూలు చేస్తోందీ సినిమా.
దీంతో చాలా మంది ఫ్రస్టేటెడ్ మేకర్లు, ఈ జనాలకు ఇవే కావాలి అని డిసైడ్ అయినట్లు కనిపిస్తోంది. దెయ్యాల సినిమాలు తీసినవే తీసిన రవిబాబు ఓ అడల్ట్ సినిమా అనౌన్స్ చేసారు. ఫస్ట్ లుక్ ఇచ్చారు.
దర్శకత్వం మీద మోజు వున్న నిర్మాత ఎమ్ ఎస్ రాజు కూడా ఇప్పుడు ఓ అడల్ట్ కంటెంట్ సినిమాను మొదలెట్టారు. ఫస్ట్ లుక్ ఇచ్చారు. పైగా తాను కూడా భారతీరాజా తదితరుల టైపులో ఓ బోల్డ్ సినిమా తీయబోతున్నా అంటూ చెబుతున్నారు. దానికి డర్టీ హరి అని పేరు పెట్టారు. అమ్మాయిని, అబ్బాయిని ఎంత ఇంటిమసీ లో చూపించాలో అంతలా చూపించారు.
గతంలో దర్శకుడు రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ కూడా ఇలాంటి సినిమా ఒకటి చేసారు. చూస్తుంటే మళ్లీ కొన్నాళ్ల పాటు ప్రేక్షకుల మీద ఈ అడల్ట్ సినిమాలు గట్టగానే దాడిచేసేలా వుంది వ్యవహారం.