దర్శకుడు అజయ్ భూపతి 'మహా సముద్రం' కాన్సెప్ట్ పోస్టర్ వచ్చింది. ఎప్పుడో 1970 – 80 కాలంలో వుండేవి ఇలాంటి లోగోలు. వ్యవహారాలు.
ఈ గట్టున ఓ అమ్మాయి-అబ్బాయి… ఆ గట్టున మరో అబ్బాయి రైలు కోసం పరుగు..ఈ గట్టు ఓ తుపాకి మాదిరిగా, ఆ గట్టు మరో (విలన్) వ్యక్తి మాదిరిగా..యంగ్ జనరేషన్ కొత్త కొత్త ఫన్ మూమెంట్స్, లైటర్ వీన్ సబ్జెక్ట్ లు తీసుకువస్తున్న కాలంలో ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీ లేదా స్వాతిముత్యం కథ అనే కాన్సెప్ట్ ను అజయ్ భూపతి తీసుకున్నట్లు కనిపిస్తోంది.
అలా తీసుకున్నారు, పైగా ఆ సబ్జెక్ట్ ను అమితంగా ప్రేమిస్తున్నారు అంటే అందులో విషయం ఏదో వుండే వుండాలి. ఎకె ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై అనిల్ సుంకర నిర్మించే ఈ సినిమా లో భావోద్వేగాలు పీక్స్ లో వుంటాయని, సినిమా చాలా హెవీ సబ్జెక్ట్ అని ఇప్పటికే టాక్ వుంది. ఇప్పుడు ఈ పోస్టర్ ఆ విషయాన్ని మరోసారి రుజువు చేస్తోంది.
శర్వానంద్-అతిరావ్ హైదరి-సిద్దార్ధలతో పాటు అను ఇమ్యాన్యుయేల్ , జగపతి బాబు కీలకపాత్రలు పోషిస్తున్నారు ఈ సినిమాలో.