అవును నిజమే హీరో రాజశేఖర్- సీనియర్ యాక్టర్ నరేష్ మళ్లీ ఒక్కటయ్యారు. రాజకీయాల్లో శాశ్వత శతృత్వాలు, మితృత్వాలు వుండవు కదా. ఆ లెక్కన ఈ ఇద్దరు మళ్లీ ఒక్కటయ్యారు. కొన్నాళ్ల క్రితం మా అసోసియేషన్ లో జీవిత రాజశేఖర్ గ్రూపు, నరేష్ గ్రూపు కత్తులు దూసుకున్నారు. ఒక దశలో రాజశేఖర్ ఓపెన్ గా అందరి ముందు బరస్ట్ అయ్యారు. దాంతో మెగాస్టార్ ఫైర్ అయ్యారు.
కానీ ఆ తరువాత మళ్లీ ఏమయిందో తెలియదు. పెద్దలు అందరూ కలిసి నరేష్ ను తాత్కాలికంగా పక్కన పెట్టి జీవిత రాజశేఖర్ గ్రూపు ను పైకి తీసుకువచ్చారు. కానీ ఇప్పుడు మళ్లీ నరేష్-జీవిత రాజశేఖర్ వర్గాలు ఒకటయ్యాయి. ఇకపై కలిసి పనిచేయడానికి, నరేష్ నే మళ్లీ మా అధ్యక్షుడిగా యాక్టివ్ గా వుండడానికి ఒక అంగీకారానికి వచ్చినట్లు బోగట్టా.
దీని వెనుక కారణం మరేమీ కాకపోవచ్చ. ఈ మధ్య మెగాస్టార్ చిరంజీవి ఇండస్ట్రీలోని యూనియన్లతో సంబంధం లేకుండా నేరుగా సమావేశాలు పెట్టడం, అందరినీ పోగుచేయడం వంటివి చేస్తున్నారు. ఇక్కడ మా అసోసియేషన్ ప్రమేయం కూడా లేకపోయింది.అటు రాజశేఖర్ లేరు. ఇటు నరేష్ లేరు. దాంతో మళ్లీ ఈ ఇద్దరు ఒక్కటై తమను తాము ప్రొజెక్ట్ చేసుకోవాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది.