Advertisement

Advertisement


Home > Movies - Movie News

ఆ ఒక్కటీ అడగాలి..ఈసారి

ఆ ఒక్కటీ అడగాలి..ఈసారి

జనం ఏమో.. కామెడీ చేయండి మహా ప్రభో అంటారు. కానీ అల్లరి నరేష్ కు మాత్రం సమ్ థింగ్ డిఫరెంట్ గా చేయాలని వుంటుంది.  అందుకే ఆ ఒక్కటీ అడక్కు అంటూ కామెడీ గురించి వదిలేసి ఏవేవో చేస్తూ వస్తున్నాడు. అందుకే అల్లరి నరేష్ అభిమానులకు ఆ సినిమాలు పూర్తి సంతృప్తి ఇవ్వడం లేదు. ఇప్పుడు కాస్త గ్యాప్ తరువాత ఫుల్ లెంగ్త్ కామెడీ సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా పేరే ఆ ఒక్కటీ అడక్కు. ఒకప్పటి క్లాసిక్ కామెడీ సినిమా టైటిల్ అది.

పెళ్లి కావడం కష్టం అనే పాయింట్ చుట్టూ అల్లుకున్న నవ్వుల కథతో తయారైన ఆ ఒక్కటీ అడక్కు సినిమా ట్రయిలర్ ను విడుదల చేసారు. కొన్నాళ్ల క్రితం ఇదే సినిమా టీజర్ వచ్చి ఆకట్టుకుంది. ఈ సారి వచ్చిన ట్రయిలర్ మరీ అహో.. అద్భుతం అన్నట్లు లేదు. పెద్దగా పంచ్ డైలాగులు, నవ్వుల పువ్వులు రాల్చలేదు.

అయితే అల్లరి నరేష్, మళ్లీ ఫుల్ లెంగ్త్ కామెడీ సినిమా చేస్తున్నారు. అదే పెద్ద ప్లస్ పాయింట్. దానికి తోడు ఎవర్ గ్రీన్ అయిన పెళ్లిళ్ల బ్యాక్ గ్రౌండ్ లో జరిగే కామెడీ. అందువల్ల సమ్ థింగ్ ఏదో ఒకటి వుంటుందని ఆశించాల్సి వుంది. అందుకే ఈ సినిమా నుంచి ‘ ఆ కామెడీ ఒక్కటీ మాత్రం అడగాల్సిందే’.

ఈ సినిమాలో హీరోయిన్ ఫరియా.. సంగీతం గోపీసుందర్. చాలా మంది కమెడియన్లు సినిమాలో కనిపిస్తున్నారు కనుక, సమ్మర్ కు మంచి ఛాయిస్ అయ్యెే అవకాళం వుంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?