క్రాక్ సినిమాతో మొహానికి రంగేసుకోవడం మొదలుపెట్టారు రచయిత, దర్శకుడు బివిఎస్ రవి. ఆ తరువాత ఈ మధ్యన వచ్చిన ధమాకా సినిమాలో కూడా నటించేసారు.
ఇప్పుడు లేటెస్ట్ గా రెండు సంక్రాంతి సినిమాల్లో కూడా రెండు క్యారెక్టర్లు చేసేసారట. జస్ట్ కామియో రోల్స్ నే, ఒక్క నిమిషం పాటు కనిపించేవే కానీ కథకు కీలకంగా వుండే పాత్రలు అంట అవి. చూస్తుంటే రవి కి మెల్లగా ఇటు ఆసక్తి పెరుగుతున్నట్లు కనిపిస్తోంది.
రైటర్ గా వుంటూనే డైరక్షన్ ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఆ రెండూ వుండగానే ఇప్పుడు యాక్టింగ్ మీద గట్టిగా దృష్టి పెట్టినట్లు కనిపిస్తోంది. సరైన పాత్రల్లో క్లిక్ అయితే ఆ కిక్ వేరు..ఆదాయం వేరు. స్వతహాగా డైరక్టర్, రైటర్ కనుక యాక్టింగ్ పెద్ద కష్టం కాదు. ఏ మాత్రం క్లిక్ అయినా గతంలో గొల్లపూడి, ఎల్బీ శ్రీరామ్ ల మాదిరిగా కొన్నాళ్లు బండి లాగించేయవచ్చు.
పైగా ఇండస్ట్రీలో ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ లకు కాస్త డిమాండ్ వుంది కూడా. రవి చేస్తున్న అన్ స్టాపబుల్ వర్క్ పూర్తి అయిపోయినట్లే. ప్రస్తుతం ఓ హీరోకు కథ తయారు చేసే పనిలో బిజీగా వున్నారని తెలుస్తోంది.