ఇది మరి ఆ కథ రాసుకున్న దర్శకుడి ఐడియానో, లేదా హిట్ ఫార్ములా అని నిర్మాతలు అనుకున్నారో, లేదా తన డైరెక్ట్ చేసిన సినిమాలో క్లిక్ అయిందని, తన నిర్మాణంలోని సినిమాలో వాడదామని దర్శకుడు త్రివిక్రమ్ అనుకున్నారో, మొత్తానికి అల వైకుంఠపురములో సినిమాను ఇమిటేట్ చేసినట్లు అయింది ఆదికేశవ సినిమా.
అల వైకుంఠపురుమలో సినిమాలో హీరో కు హీరోయిన్ బాస్. లేడీ బాస్ దగ్గర వుంటూనే, ఆమెనే ఫ్లర్ట్ చేస్తుంటాడు. ఇక్కడ కూడా అంతే. శ్రీలీల దగ్గర పనికి జాయిన్ అవుతాడు. వెనుక వెనుకే తిరుగుతుంటాడు వైష్టవ్ తేజ్.
పిలుపు కూడా అక్కడ మాదిరిగానే.. మేడమ్.. మేడమ్ అంటూ.
అల వైకుంఠపురములో కెమేరా పూజా హెగ్డే కాళ్లు, మరి కాస్త పైన ఎక్కువగా ఫోకస్ అవుతుంది. ఆఫీస్ కు మోకాళ్ల వరకు మాత్రమే వున్న డ్రెస్ వేసుకువస్తుంది పూజా హెగ్డే. ఈ సినిమాలో శ్రీలీల ఇంకా పైపైకి వుండే డ్రెస్ లు ఎక్కువగా వేసుకుంటుంది ఆఫీస్ కు వచ్చినపుడు.
అల వైకుంఠపురములో సినిమాలో బోర్డ్ రూమ్ లో రకరకాల పాటలకు డ్యాన్స్ లు చేస్తాడు హీరో బన్నీ
ఆదికేశవలో డిటో.. డిటో.. సినిమా ఆరంభంలోనే హీరోయిన్ శ్రీలీల ఇదే విధమైన డ్యాన్స్ లు చేస్తుంది.
అల వైకుంఠపురములో సినిమాలో హీరో డబ్బున్న ఇంట్లో బదులు, మిడిల్ క్లాస్ ఇంట్లో పెరుగుతాడు. చిన్నప్పటి నుంచి అసలు తల్లితండ్రులు ఎవరో తెలియకుండానే.
ఆదికేశవలో కూడా డిటో. చిన్నప్పుడే రాయలసీమ నుంచి వేరే చోటకు మారిపోయి పెరుగుతాడు.
మొత్తానికి ఆదికేశవ సినిమా అల వైకుంఠపురములో సినిమాకు పూర్ ఇమిటేషన్ అనుకోవాలేమో?