ఆదిపురుష్ సినిమా 2023 సంక్రాంతికి రావడం లేదని ముందుగా వెళ్లడించింది గ్రేట్ ఆంధ్రనే. తరువాత అఫీషియల్ గా వాయిదా పడింది. ఈ లోగా టీజర్ రావడం, దాని మీద గడబిడ, రావణుడి గెటప్ మీద అభ్యంతరాలు, సిజి వర్క్ మీద అసంతృప్తి ఇలా చాలా చాలా జరిగాయి.
ఈ లోగా ప్రాజెక్ట్ కే ఇంకా మిగిలిన సినిమాల మీద ప్రభాస్ వర్క్ చేయడం ప్రారంభించారు. అదే సమయంలో ఆదిపురుష్ గెటప్ లు, సిజి వర్క్ ల విషయంలో అన్నీ రెక్టిఫై చేసే పనులు ప్రారంభమయ్యాయని వార్తలు వినిపించడం మొదలైంది.
ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు కొత్త వార్తలు వినిపిస్తున్నాయి. ఆదిపురుష్ ను అన్ని విధాలా పూల్ ప్రూఫ్ గా చేయడం కోసం మరింత వెనక్కు పెడుతున్నారని, దాని కన్నా ముందు సలార్, ప్రాజెక్ట్ కె సినిమాలు విడుదలవుతాయని టాక్ వినిపిస్తోంది.
సలార్ రెండు భాగాలు ఒకేసారి షూట్ చేయడం, ప్రాజెక్ట్ కె పూర్తి చేయడం మీదే ప్రభాస్ కీలకంగా దృష్టి పెట్టారని ఇండస్ట్రీ టాక్. సలార్ ఒక భాగం అయిన తరువాత ప్రాజెక్ట్ కే వుంటుందా? లేదా రెండు భాగాలు విడుదలయ్యాక ప్రాజెక్ట్ కే వుంటుందా అన్నది మాత్రం క్లారిటీగా వినిపించడం లేదు. కానీ ప్రాజెక్ట్ కే ను వీలయినంత త్వరగా పూర్తి చేసే ప్రయత్నాలు మాత్రం జరుగుతున్నాయి. ఇటీవలే ఓ పెద్ద షెడ్యూలు పూర్తి చేసారు.
ఈ వార్తలే కరెక్ట్ అయితే 2024 కు కానీ ఆదిపురుష్ రాకపోవచ్చు. అలాగే పీపుల్స్ మీడియా సినిమా కూడా 2024లోనే వుండే అవకాశం వుంది. మొత్తం మీద ప్రభాస్ సినిమాలు ముందు వెనుక అన్న వార్తలు బలంగా వినిపిస్తున్నాయి.