అదేంటో పాపం, ప్రభాస్ సినిమాకు సరైన మ్యూజిక్ డైరక్టర్ సెట్ కావడం లేదు. బాహుబలి తరువాత పాన్ ఇండియా స్టార్ గా మారిపోవడం, ఆ రేంజ్ సినిమాలు తీస్తుండడంతో, దానికి తగిన మ్యూజిక్ డైరక్టర్లు కావాలని రకరకాల ప్రయోగాలు చేయాల్సి వస్తోంది.
సాహో సినిమా కు చివరి నిమిషం వరకు మ్యూజిక్ డైరక్టర్ సెట్ కాలేదు. ఆఖరికి ఒకరిని మించి జనాలను తీసుకుని పాటలు చేయించుకున్నారు.
రాధేశ్యామ్ సినిమా సంగతి పక్కన పెడితే, ఎందుకంటే ప్రభాస్ ఫ్యాన్స్ ఆ సినిమా కన్నా, ఆదిపురుష్, సలార్ సినిమాల మీద ఎక్కువ ఆశలు పెట్టుకున్నారు. ఆదిపురుష్ సినిమాకు కీరవాణి మ్యూజిక్ డైరక్టర్ అని ఆరంభంలో వినిపించింది. కానీ ఇప్పుడు సంగీత ద్వయం సాచెట్ టాండన్, పరంపర ఠాకూర్ అలియాస్ పరంపర టాండన్ లను కన్ ఫర్మ్ చేసారు.
ఈ ఇద్దరు కలిసి భూమి, కబీర్ సింగ్, తానాజీ, జెర్సీ సినిమాలకు సంగీతం అందించారు. ఇప్పుడు ఈ ఇద్దరే ఆదిపురుష్ కు కూడా సంగీతం అందించబోతున్నారు.
రామాయణ గాధ ఆధారంగా తీస్తున్న ఆదిపురుష్ సినిమాలో కచ్చితంగా సంగీతం కూడా కీలకపాత్ర పోషిస్తుంది. అందుకే ఇటీవల టాలీవుడ్ లో క్రేజీ మ్యూజిక్ ద్వయంగా పేరుపొందిన వీరిద్దరిని తీసుకుని వుంటారు.