'థగ్స్ ఆఫ్ హిందూస్తాన్' గత కొంతకాలంలో వచ్చిన టాప్ డిజాస్టర్లలో ఒకటి. అత్యంత భారీ వ్యయంతో రూపొందిన ఈ సినిమా భారీ అంచనాల మధ్యన వచ్చి డిజాస్టర్ గా నిలిచింది. ఆమిర్ ఖాన్ ఫుల్ ఫామ్ లో ఉన్న సమయంలో విడుదల అయిన ఈ సినిమా ఏ మాత్రం ఆకట్టుకోలేకపోయింది.
సాధారణంగా స్టార్ హీరోలు తమ డిజాస్టర్ల గురించి ఎక్కువ కాలం మాట్లాడరు. ఫెయిల్యూర్ జనాలు మరిచిపోతేనే తమ తదుపరి సినిమాలపై వారి ఆసక్తి మిగులుతుందనే లాజిక్ ను ఇక్కడ అప్లై చేయవచ్చు.
అయితే 'థగ్స్..' ఫెయిల్యూర్ ఆమిర్ ను అంత తేలికగా వదలడం లేదు. ఈ నేపథ్యంలో ఆ హీరో ఆ సినిమాపై స్పందించాడు.
ఆ సినిమా ఫెయిల్యూర్ బాధ్యత తనదే అని ఆమిర్ అంటున్నాడు. ఆ సినిమాతో ప్రేక్షకుల అంచనాలను ఏ మాత్రం అందుకోలేకపోయినట్టుగా ఆమిర్ ఒప్పుకున్నాడు. ప్రేక్షకులను తీవ్రంగా నిరాశపరిచామంటూ .. ఆ విషయంలో సారీ చెబుతున్నట్టుగా ఆమిర్ ఖాన్ ప్రకటించాడు.
కథాపరంగా ఏ మాత్రం పసలేని సినిమాలను ఎంపిక చేసుకున్నట్టుగా హీరోలు కాస్త ఆలోచిస్తే అలాంటి డిజాస్టర్లు చోటు చేసుకోవేమో!