టాలీవుడ్ లో ఇటీవల డిజాస్టర్లలో అతి పెద్దది ఆచార్య సినిమానే. ఒక్క నైజాంలోనే 20 కోట్ల మేరకు బయ్యర్ నష్టపోయారని అంచనా. ఇక ఆంధ్ర, సీడెడ్ ల లెక్కలు కూడా ఆ లెవెల్ లోనే వున్నాయి. ఇప్పుడు ఈ సినిమా బయ్యర్లు అందరినీ ఆదుకోవాలి. వీరిలో దర్శకుడు కొరటాలకు అత్యంత సన్నిహితులు కూడా వున్నారు. వీరందరికీ సెటిల్ మెంట్లు చేయాల్సి వుంది. కానీ ఇవ్వాళ..రేపు అంటూనే ముందుకు వెళ్తోంది వ్యవహారం.
నిజానికి ఈ సినిమాను దర్శకుడు కొరటాలకు అన్ని విధాలా అప్పగించేసారన్న వార్తలు ఆది నుంచీ వినిపించాయి. ఆ తరువాత విడుదలకు ముందు కిందా మీదా పడ్డారు. ఆఖరికి నిర్మాత నిరంజన్ రెడ్డినే అన్ని విధాలా వెనక్కు తగ్గి, నష్టాలు భరించాల్సి వచ్చింది. తీరా విడుదలయిన తరువాత మళ్లీ పరిస్థితి మొదటికి వచ్చింది.
ఇప్పుడు ఎవరు చెల్లించాలి వెనక్కు అన్నది సమస్య. పైకి ఎన్ని చెప్పినా, మెగాస్టార్ చిరంజీవి, చరణ్ లకు కలిపి రెమ్యూనిరేషన్ బాగానే పే చేసారని టాక్. అందుకే చిరంజీవి విదేశాల నుంచి వచ్చాక సెటిల్ చేస్తామనే భరోసా బయ్యర్లకు వచ్చింది. దాంతో అలా వేచి వున్నారు. కానీ చిరంజీవి వెనక్కు వచ్చినా సమస్య పరిష్కారం కాలేదు. ఇప్పుడు నిర్మాత విదేశాల్లో వున్నారు. ఆయన రావాలి అని చెబుతున్నారని వినిపిస్తోంది.
దీంతో మళ్లీ వెయింటింగ్ నే సమస్య అయింది. ఒక్క వెస్ట్ గోదావరి బయ్యర్ మాత్రం మైత్రీతో కొరటాలకు వున్న సంబంధాలు తెలుసు కనుక, సర్కారు వారి పాట సినిమాకు రెండు కోట్లు తక్కువ కట్టి, దాన్ని కొరటాలకు లింక్ పెట్టారని తెలుస్తోంది.
వైజాగ్, కృష్ణా, మరో ఏరియా కొరటాల స్నేహితుడే. ఈస్ట్ కూడా కొరటాల సన్నిహితుడే. అందుువల్ల అక్కడ పెద్దగా సమస్య లేదు. సీడెడ్, నైజాంల్లోనే సమస్య. అది తేలాల్సి వుంది.